logo

ప్రవేట్ మెడికల్ కాలేజీలను వ్యతిరేకించండి- కేతిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నాయకత్వంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ప్రజాప్రదర్శన నిర్వహించారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల వల్ల పేదలు మధ్యతరగతి ప్రజలు లబ్ధి పొందుతారని వేలాదిమంది పేద విద్యార్థులు డాక్టర్లు గా నిలుస్తారని కెతిరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టగా అందులో పది పూర్తి కావడం జరిగిందని తెలిపారు. కొన్ని చొట్ల మెడికల్ కళాశాలలో ప్రారంభం కావడం జరిగిందన్నారు ఇందుకోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రు8480 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల నిర్మాణాలు పూర్తిచేసి పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం ఉచితంగా లభించే విధంగా చర్యలు తీసుకోవడం మాని ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కళాశాలలో అప్పజెప్పి తన పబ్బం గడుపుకోవాలని చూసిందన్నారు. రాష్ట్ర చరిత్రలో వైయస్సార్ సిపి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన అద్భుతమైన కార్యక్రమాన్ని నీరు కార్చటమే ఈ ప్రభుత్వము లక్ష్యమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అమీర్ భాష. వైయస్సార్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి పురుషోత్తం రెడ్డి ధర్మవరం నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు పిఎంజెడ్ సాదిక్ భాషా. షేక్ ఫయాజ్. వైయస్సార్సీపి జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసులు రెడ్డి నాయకులు నీలూరి ప్రకాష్. బాలిరెడ్డి. నాగరాజు. కాంట్రాక్టర్ ఖాదర్ వలీ. జిలాన్ భాష. జాకీర్. బెస్త వెంకటరమణ. జి ఆర్ రామ్మోహన. చిగిచెర్ల ప్రభాకర్ రెడ్డి. మీడియా సెల్ రామయ్య తదితరులు పాల్గొన్నారు.

96
2854 views