రుద్రభూమి కి కూడా వదలరా ఈ సిగ్గులేని జనాలు
గ్రేటర్ విశాఖపట్నం పరిధిలో అనకాపల్లి జోన్ శివారు లో ఉన్న హిందూ స్మశాన వాటిక ని, చుట్టుపక్కల ఉన్న జనాలు నిర్లజ్జాగా డంపింగ్ యార్డ్ ల వాడుతూ, హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ప్రవర్తిస్తున్నారు.
అక్కడ ఎవరన్నా ఖననం చేసాక మరల ఆ సమాధి ని చూడడానికి వస్తే చుట్టూ అంత చెత్తకుప్పల మారుస్తున్నారు. తమ పెద్దలకి అగౌరవం అవుతోందని, అక్కడ ఖననం చేసిన వారి బంధువుల బాధ వర్ణానాతీతం.
సాధారణంగా వరహాలని అపరిసభ్రత కి చిహ్నం అనుకుంటారు. కానీ అవి కూడా ఎక్కడ పడితే అక్కడ పాడుచేయవు. కానీ నిర్లజ్జాగా, నిర్లక్ష్యం గా మనుషులే, ఇతరుల బాధ ని పట్టించుకోకుండా ప్రవర్తిస్తారు. ఇకనైనా హిందూ స్మశాన వాటిక ని శుభ్రం గా ఉండేలా, మరియు ఇతరులు పాడుచేయకుండా చూడాలని సంబందిత అధికారులు చర్య తీసుకోవాలని అక్కడ వారి పెద్దలని ఖననం చేసిన బంధువులు వాపోతున్నారు