logo

. . తెలుగు దేశం పార్టీ నూతన కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం . పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు గా నాగేంద్రమణి

(ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా)

చీరాల తెలుగు దేశం పార్టీ నూతన కమిటీలు కార్యవర్గ సభ్యులు ప్రమమాణ స్వీకార మహోత్సవం బుధవారం ఎమ్మెల్యే కొండయ్య క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మండల పార్టీ అధ్యక్షులతో పాటు కార్యవర్గ సభ్యులను సైతం ప్రకటించి ప్రమాణస్వీకారం చేయించారు. అయితే చీరాల పట్టణ అధ్యక్షుడు గా దోగుపర్తి సురేష్ ను ప్రకటించినప్పటికీ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి అనుమతి రాని కారణంగా ప్రమాణ స్వీకారం జరగలేదు.ఇదిలా ఉంటే సుదీర్ఘ కాలం రాజకీయాల్లో మహిళా విభాగం పలు హోదాల్లో పనిచేసిన ఉక్కు మహిళ దర్శి నాగేంద్రమణి ని చీరాల పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు గా ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా ఆమె ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఇచ్చిన పదవిని బాధ్యత గా తీసుకొని చీరాల పట్టంలో పార్టీ బలోపేతాని తన వంతు కృషి చేస్తూ ఎక్కడా ఎటువంటి వర్గవిబేధాలకు తావివ్వకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తానని నాగేంద్రమణి అన్నారు.

25
10283 views