logo

బ్యాంక్ సేవల్లో లంచ్ బ్రేక్ పేరుతో కౌంటర్లను మూసివేయడానికి వీలులేదు

భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారం... ప్రభుత్వ, ప్రైవేట్ లేదా సహకార బ్యాంకుల్లో భోజనం కోసం ఎలాంటి నిర్ణీత సమయం లేదు. భోజన సమయంలో కౌంటర్లన్నీ ఒకేసారి మూసివేయకూడదు. విధుల్లో ఉన్న సిబ్బందిలో ఎవరో ఒకరు రొటేషన్ పద్ధతిలో కస్టమర్లకు తప్పనిసరిగా సేవలు అందించాల్సి ఉంటుంది. ఒకప్పుడు బ్యాంకుల్లో ఈ లంచ్ బ్రేక్ ఉండేది... కానీ ప్రస్తుతం ఇది చెల్లదు. ఒకవేళ ఏ బ్యాంకులోనైనా లంచ్ బ్రేక్ పేరు చెప్పి ఇబ్బంది పెడితే వినియోగదారులు ఆర్‌బీఐ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

0
24 views