logo

బి టి పి ఎస్ ఉద్యోగుల ఔదార్యం తిర్లాపురం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, ప్లేట్లు, గ్లాసుల పంపిణీ...!

బి టి పి ఎస్ ఉద్యోగుల ఆధ్వర్యంలో మణుగూరు మండలంలోని తిర్లాపురం పంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం నాడు బి టి పి ఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. బి టి పి ఎస్ చీఫ్ ఇంజనీర్ భూక్య. బిచ్చన్న ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచటిస్తూ
“బి టి పి ఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ టీం గత మూడు సంవత్సరాలుగా ప్రత్యేక చొరవతో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోందనీ అట్టి సేవా కార్యక్రమాలలో భాగంగా తిర్లాపురం ప్రాథమిక పాఠశాలలో సుమారు వందమంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేయడం అట్టి కార్యక్రమానికి తనను ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థుల బాధ్యతను కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ
“చదువును ఇష్టంగా చదువుకోవాలని , కష్టంగా అనిపించుకోకూడదన్నారు. సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలనీ. మంచి చదువుతో తల్లిదండ్రులకు, గురువులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలనీ ఆయన ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ టీం సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

4
209 views