logo

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకే ఇల్లందు పట్టణాలలో పోలీస్ బృందం జోరుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

మద్యం తాగి వాహనాలు నడపడం కారణంగా ప్రమాదాలు జరుగుతుండడంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు చేపడుతున్నారు హైమా మీడియా ఇల్లందు :-డ్రంక్ అండ్ డ్రైవ్ ఇల్లందు పట్టణంలో అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి డ్రంకెన్ డ్రైవ్ కారణంగా అధికంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి దీంతో మద్యం తాగి వాహనాలు నడిపితే వారిపై కఠిన చర్య వ్యవహరిస్తున్నారు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... మందు బాబుల ఆట కట్టిస్తున్నారు తాగి బండ్లు నడుపుతూ దొరికిన వారికి కోర్టులో ప్రవేశపెడుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టులు జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలపై పోలీసులు ఒకవైపు అవగాహన కల్పిస్తున్నారు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఇల్లందు పట్టణ సీఐ తాటిపాముల సురేష్ పేర్కొంటున్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని సైతం ఆయా కార్యక్రమంలో భాగంగా స్పష్టం చేస్తున్నారు మరోవైపు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు అయినా వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్య నేరం మాత్రమే కాదు అది ప్రాణాలతో చెలగాటాడటమే. డ్రంకెన్ డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటాం ప్రజలు భద్రతే మాకు ముఖ్యం ప్రతిరోజు తనిఖీలు కొనసాగుతాయి వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీసులకు సహకరించాలి

60
18996 views