logo

కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ



*కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ..*

*స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న సందర్భంగా సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఉంచాలి....*

*ప్రాపర్టీ కేసులలో రికవరీ శాతం పెంచాలి......*

*రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి....*


నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS నేడు ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

👉ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణం, లాకప్ గదులు, ప్రాపర్టీ స్టోరేజ్ రూమ్,పలు కేసుల ఫైళ్లను సమగ్రంగా పరిశీలించారు.
👉స్టేషన్ లో గల సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు.
👉ప్రాపర్టీ కేసులలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రికవరీ శాతాన్ని పెంచాలని పలు సూచనలు చేశారు.
👉ప్రజల భద్రత ,శాంతిభద్రతల పరిరక్షణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని స్టేషన్ పరిధిలోని గ్రామాలలో ఎలాంటి అల్లర్లు గొడవలు జరగకుండా గ్రామాలను తరచూ సందర్శించాలని ముఖ్యంగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సమస్యాత్మక గ్రామాలపై గట్టిగా ఉంచాలని ఆదేశించారు.
👉మిస్సింగ్ కేసులలో ప్రత్యేక శ్రద్ధ ఉంచాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అదృశ్యమైన వారి ఆచూకీ కనుగొనాలని ఆదేశించారు.
👉రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి వాటిని అమలు చేయాలని సైబర్ క్రైమ్, బాల్యవివాహాలు మొదలగు వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

👉 స్టేషన్ లోని 112 టోల్ ఫ్రీ కి సంబంధించిన ట్యాబ్ లను పరిశీలిస్తూ డయల్ 112 కాల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం బాధితులు ప్రమాదకటికల్లో ఉన్నప్పుడు వేగంగా స్పందించి వారిని ప్రమాదం నుండి రక్షించాలని వీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బంది అధికారులను ఆదేశించారు.


157
1806 views