
శ్రీశైలం దేవస్థానంలో మొట్టమొదటిసారిగా కోటి దీపోత్సవం కార్యక్రమం
*శ్రీశైలదేవస్థానంలో
మొట్టమొదటిసారిగాకోటి దీపోత్సవం*
RK72TV, న్యూస్
కార్తీకమాసోత్సవాల సందర్భంగా నాలగవ శుక్రవారమైన14,11.2025 నదేవస్థానంకోటిదీపోత్సవాన్నినిర్వహిస్తోంది.ఆలయ ముందుభాగంలో గల గంగాధర మండపం వద్ద సాయంత్రం గం.6.00ల నుంచి ఈ కోటిదీపోత్సవంజరిపించబడుతోంది.ఇందుకోసం ప్రత్యేక వేదిక కూడా సిద్ధం చేయడం జరిగింది. కాగా ఈ దీపోత్సవానికి కావలసిన పూజాద్రవ్యాలనన్నింటినీ దేవస్థానమేసమకూరుస్తుంది.ముందుగా సాయంత్రం గం.5.00లకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డా.దీవిహయాగ్రీవాచార్యుల వారిచే కోటిదీపోత్సవవిశేషాలువివరించబడుతాయి.అనంతరం ప్రఖ్యాత నాట్యకళాకారిణి కుమారి లిక్షితాశ్రీ మరియు వారి బృందంచే సంప్రదాయ
నృతంనిర్వహించబడుతుంది.తరువాత కోటిదీపోత్సవ ప్రత్యేక వేదికపై గం.6.30ల నుంచి
శ్రీస్వామిఅమ్మవార్లఉత్సవమూర్తులకు విశేషపూజలు,
కోటిదీపోత్సవంజరిపించబడుతుంది. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు దశహారతులుగాఓంకారహారతి,నాగహారతి,త్రిశూలహారతి,నందిహారతి,సింహహారతి,సూర్యహారతి,చంద్రహారతి,కుంభహారతి,నక్షత్రహారతి, కర్పూరహారతిసమర్పించబడుతాయి
దశవిధ హారతుల తరువాత పద్మశ్రీ పురస్కార గ్రహీత మహాకవి బృహత్ ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణిశర్మవారిచే ‘శ్రీశైలక్షేత్రం కోటిదీపోత్సవం’అనే అంశంపై దివ్య ప్రవచన కార్యక్రమంనిర్వహించబడుతుంది.చివరగామంత్రపుష్పం,తీర్థప్రసాద వితరణ, ఆశీర్వచనంతో కోటిదీపోత్సవ కార్యక్రమం ముగించబడుతుంది.కాగా వైదిక సంప్రదాయంలో దీపానికి ఎంతో ప్రాధాన్యంకల్పించబడింది.దీపజ్యోతినియజ్ఞాగ్నికిసంకేతంగాచెబుతారు.ముఖ్యంగా జ్ఞానం,వెలుగు, ఉత్సాహం,ఆనందం,శాంతి మొదలైనవాటికి దీపాన్ని ప్రతీకగా భావిస్తారు.దీపారాధన వలనఈ దివ్యగుణాలను పొందవచ్చునని కూడాచెప్పబడుతోంది.పరమేశ్వరునికి దీపజ్యోతిని సమర్పించడం వలన
సకలశుభాలు కలుగుతాయని చెప్పబడుతోంది.