logo

బాలల దినోత్సవ సందర్భంగా అలరించిన చైతన్య స్కూల్ విద్యార్థులు



మీ 24 న్యూస్, నవంబర్ - 14 రాజాం చైతన్య పాఠశాలలో జవహర్ లాల్ నెహ్రు జయంతి సందర్భంగా బాలల దినోత్సవాని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా రీజనల్ అధికారి శ్రీనివాస్, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల అలంకరించి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం ప్రిన్సిపా ల్ ప్రభాకర్ గార మాట్లాడుతూ భారత మొదటి ప్రధానమంత్రి నెహ్రూ జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. సున్నితమైన మనస్తత్వం కలిగిన నెహ్రూ చిన్నపిల్లల అన్న గులాబీ పువ్వులన్న ఎంతో ఇష్టమని చెప్పారు. కనుక నెహ్రూ జయంతి. బాలల దినోత్సవం గా యావత్ భారతదేశం నిర్వహిస్తోంది. విద్యార్థులు క్రమశిక్షణతో మెలి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో అకడమి కోఆర్డినేటర్ బాలరాజు, డీన్లు సుదర్శన్, శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఏఓ ఎల్ల నాయుడు, జామి చిన్నోడు,, ప్రైమరీ ఇన్చార్జ్ సరోజిని. ప్రీ ప్రైమరీ ఇన్చార్జి జగదీశ్వర్ మరియు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

0
0 views