సూరారం: రాత్రి ఇంట్లో అగ్నిప్రమాదం
కుత్బుల్లాపూర్ పరిధి సూరారంలోని ఓక్షిత్ ఎన్క్లేవ్లో ఇంట్లో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న జీడిమెట్ల అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో సోఫా, టీవీ కాలిపోయాయి.