
C I I సమ్మిట్ విజయవంతం..!!!
AIMA MEDIA :NOV 16:MONDAY :VISAKHA
AIMA NEWS 9:- విశాఖపట్నం లో ఈ నెల జరిగిన సి ఐ ఐ సమ్మెట్ భాగస్వామ్యం సదస్సు విజయవంతం అయ్యింది అని నగర పోలీస్ కమీషనర్ Dr శాంకా భగీచి తెలిపారు.. ఈ కార్యక్రమం లో అయినా మాట్లాడు తూ..------------------------- ** --------------------
విశాఖపట్నం సిటీ,
విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకముగా జరిగిన సి.ఐ.ఐ భాగస్వామ్య సదస్సును అన్ని శాఖల సమన్వయంతో, నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారి పర్యవేక్షణలో పటిష్ట బందొబస్తూ మధ్య ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతముగా భద్రత కల్పించడం జరిగినది.
▪️నగరానికి విచ్చేసిన పలు దేశాల ప్రతినిధులు, ప్రముఖుల కోసం పోలీసు సిబ్బందితో నిరంతర నిఘాతో, అన్ని భద్రతా చర్యలు చేపట్టడమైనది.
▪️ సి.ఐ.ఐ భాగస్వామ్య సదస్సు జరిగిన వేదిక పరిసర ప్రాంతాలు, సదస్సుకు విచ్చేసిన దేశ,విధేశీ ప్రతినిధులు బస చేసిన ప్రముఖ హోటళ్ళను, నగరంలో పలు సంస్థల ప్రతినిధులు సందర్శించిన ప్రాంతాల వద్దా పూర్తి బందో బస్తు ఏర్పాట్లు చేసి ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా ముగిసేలా చర్యలు తీసుకోవడం జరిగినది.
▪️ సి.ఐ.ఐ భాగస్వామ్య సదస్సు ప్రాంగణం వద్దా , ఎయిర్పోర్ట్ వద్దా, సదస్సుకు హాజరగు ప్రతినిధులకు వసతి కల్పించే హోటళ్ల వద్దా స్నిఫర్ డాగ్ స్క్వాడ్లతో, బాంబు స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
▪️ దేశ,విధేశీ ప్రతినిధులు ప్రయాణించు మార్గాలలో రూట్ బందో బస్తులతో పాటూ వి.ఐ.పిలు ప్రయాణించు రహదారులూ, సదస్సు వద్దా పూర్తి నిఘాతో ఏ.ఎస్.సి ,ఆర్.ఓ.పి లను నిర్వహించారు.నగరంలో ముఖ్య ప్రాంతాలలో పికెట్స్,గార్డులను ఏర్పాటు చేసి నిరంతరం వాహనాలను తనిఖీ చేయడం జరిగినది.
▪️నగర పోలీస్ కమిషనర్ గారు పలు శాఖల నగర అధికారులతో పాటూ, రాష్ట్రఅధికారులతో సమావేశాలలో పాల్గొంటూ, సదస్సు జరిగిన సమయంలోనూ, ప్రతినిధులు పాల్గొన్న అన్ని కార్యక్రమాలను, వారి భద్రతా మరియు ఇతర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఈ సదస్సు విజయవంతం కావడానికి కృషి చేశారు.
నగరంలో పరిస్థితులకు అనుగుణంగా , ఎంతో పగడ్బంధీగా భద్రతా ఏర్పాట్లు చేసి, అనునిత్యం డ్రోన్లతో, సీసీటీవీ కెమెరాలతో, బాడీ వార్న్ కెమెరాలతో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ యెటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా విజయవంతముగా భద్రత కల్పించడం జరిగినది.
ముఖ్యముగా సీపీ గారి చొరవతో ఫీల్డ్ డెస్క్, ట్రాఫిక్ డెస్క్, సర్వయిలెన్స్ డెస్క్, కాన్వెయ్ డెస్క్, డ్రోన్ డెస్క్, సెక్యూరిటీ డెస్క్, సోషల్ మీడియా డెస్క్, డాకుమెంటేషన్ డెస్క్, కమ్యూనికేషన్ డెస్క్, కమాండ్ డెస్క్ లను ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ సజావుగా సాగేందుకు అస్త్రం యాప్ ను వినియోగించడం వంటి పలు చర్యలు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఎటువంటి అవరోధాలు లేకుండా సజావు గా జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగినది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతము చేస్తూ బందోబస్తు నిర్వహించిన పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి సీపీ గారు ప్రత్యేక అభినందనలు తెలియపరిచారు. పోలీసులకు పూర్తిగా సహకరించి సి.ఐ.ఐ భాగస్వామ్య సదస్సును విజయవంతం చేయడంలో భాగమైన నగర ప్రజలకు నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు కృతజ్ఞతలు తెలియజేసారు.
సి.ఐ.ఐ భాగస్వామ్య సదస్సు భద్రత నిమిత్తం నగరానికి విధులు నిర్వహించడానికి వచ్చిన పలు జిల్లాల పోలీసు అధికారులు మరియు సిబ్బంది తమకు సీపీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని అందించిన బస వసతుల ఏర్పాట్ల పట్ల, సమయానికి సరిపడా భోజన ఏర్పాట్ల పట్ల తమ హర్షం తెలియజేస్తూ సీపీ గారికి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
నగర పోలీసు తరపున,
విశాఖపట్నం సిటీ.