
ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ కి ప్రైవేట్ నర్సింగ్ హోమ్
జిల్లా అధికారుల ప్రోత్సాహంతో నిరంతరం ప్రైవేట్ లోనే సేవలు చుట్టపు చూపుగా
ఇల్లందు ఏరియా ఆస్పత్రికి రాక ప్రభుత్వ వైద్యం అందక రోగులు పడిగాపులు
వైద్య జిల్లా అధికారి అండతోనే కొనసాగుతున్న వైనం
ఇల్లందు నవంబర్ 17 ( హైమ మీడియా ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రభుత్వ హాస్పటల్ లో ప్రజలకు సకాలంలో అందాల్సిన మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ స్వయంగా ఆదేశాలు జారీ చేస్తున్న ఇల్లందు ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్ తీరు మారట్లేదు అంటూ స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు సూపర్డెంట్ గా ప్రభుత్వ హాస్పిటల్లో విధులు నిర్వహించాల్సిన బాధ్యత పక్కనపెట్టి ఓ ప్రైవేట్ హాస్పటల్ నెలకొల్పడంతో దానికే పరిమితమైన ప్రభుత్వ హాస్పటల్ ను గాలికి వదిలేసి ప్రభుత్వ ఆస్పత్రికి అడప దడప వచ్చి వెళ్తుండటంపై అంతరాయం ఏమిటి అని ప్రజలు రోగులు ఆగ్రహిస్తున్నారు. ఎప్పుడు చూసినా సూపర్డెంట్ గది ఖాళీగా ఉంటూ ఫ్యాన్ తిరుగుతుండటం గమనార్హం సూపర్డెంట్ వ్యవహార తీరుపై ప్రజలు జిల్లా అధికారికి ఎన్నిసార్లు ఫొటోస్ తీసి వాళ్ళ బాధ విన్నపించుకున్న చర్యలు తీసుకోకపోవడంలో ఆయన నిర్లక్ష్యంగా ఉన్నారని సూపర్డెంట్ విధులకు జిల్లా అధికారి వత్తాసు పలకడంలో అంతర్యం ఏమిటో అర్థం కావట్లేదు అంటున్నారు ప్రజలకు అందుబాటులో లేని సూపర్డెంట్ పై అంతా మమకారం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు.. ఇల్లందు హాస్పిటల్ లో సూపర్డెంట్ గా బాధితులు నిర్వహిస్తూ సొంత ప్రైవేట్ హాస్పటల్ పై ఫోకస్ పెడుతూ అక్కడే ఉంటున్నారని విమర్శలు అనేకంగా ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే వారిలో మార్పు లేదంటున్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు చోద్యం చూస్తూ ఉండడంతో ఇక్కడ సూపర్డెంట్ తీరు ఎలా ఉందంటే ఆడిందే ఆట పాడిందే పాట సాగుతుందన్నారు ఇల్లందు ప్రభుత్వ హాస్పటల్ స్థాయి పెరిగినప్పటికీ, రోగులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు రోగుల అవస్థలు వర్ణాతీతం అయిందని వైద్యం కోసం వచ్చిన రోగులకు సిద్ధిరపు తప్ప వైద్యం అందటం లేదని అంటున్నారు వైద్య సిబ్బంది హాజరు ఔషధ నివాళులు శుభ్రత శానిటేషన్ గర్భిణీ .స్త్రీలు శిశువులకు. అందిస్తున్న సేవలు ప్రసూతి గది, ల్యాబ్ అవుట్లెట్ పేషెంట్ విభాగం పేషంట్ వెయిటింగ్ హాల్ మరియు టాయిలెట్ రూమ్స్ అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా లేవా అనేది ప్రశ్నార్థంకంగా ఉందని సంబంధిత ప్రభుత్వ అధికారులు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ హాస్పటల్ తీరుపై దృష్టి సారించాలని ప్రజలు కోరారు