logo

డిపివో కార్యాలయానికి అదనపు కలెక్టర్ నోటీసులు - ఆర్టీఐ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు - మూడు జతల పూర్తి సమాచారంతో రావాలని హుకుం

డిపివో కార్యాలయానికి అదనపు కలెక్టర్ నోటీసులు

- ఆర్టీఐ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు

- మూడు జతల పూర్తి సమాచారంతో రావాలని హుకుం

జగిత్యాల జిల్లా/ బుగ్గారం :

సమాచార హక్కు చట్టం - 2005 ప్రకారం సీనియర్ ఆర్టీఐ కార్యకర్త చుక్క గంగారెడ్డి చేసిన అప్పీల్ పై జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలోని పౌర సమాచార అధికారికి రెండు నోటీసులు జారీ చేశారు.
అట్టి నోటీసుల ప్రతులు రిజిస్టర్ పోస్ట్ ద్వారా చుక్క గంగారెడ్డి కి అందాయి.
గతంలో కొంత సమాచారం కావాలని ఆయన పలు దరఖాస్తులు చేశారు. డిపివో కార్యాలయంలోని పౌర సమాచార అధికారి ఆయనకు సమాచారం ఇవ్వడంలో విఫలం అయ్యారు. దానిపై చుక్క గంగారెడ్డి తేది: 28- 04- 2025 న జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అప్పీలేట్ అధికారికి అప్పీల్ చేశారు.
అట్టి అప్పీల్ పై జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత ఈ నెల 21 శుక్రవారం విచారణ చేపట్టనున్నారు. దరఖాస్తుదారుడు కోరిన పూర్తి సమాచారం మూడు సెట్లతో తప్పకుండా విచారణకు హాజరు కావాలని డిపివో కార్యాలయంలోని పౌర సమాచార అధికారికి అట్టి నోటీసులో ఆదేశించారు.

45
1341 views