
మద్రాస్ ఐఐటి సీట్లు పొందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
అభినందించిన
కోఆర్డినేటర్ అనుమాన్ జ్యోతి ,ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య
తొర్రూర్ (మహబూబాద్ జిల్లా), నవంబర్ 21 (AIMEMEDIA)
16 మంది జడ్.పి.హెచ్.ఎస్ తొర్రూర్ విద్యార్థులు ఐఐటి మద్రాస్ కోర్సులను సాధించారని తొర్రూరు ప్రభుత్వ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జెల్ల లక్ష్మీనారాయణ కోఆర్డినేటర్ జ్యోతి తెలిపారు.శుక్రవారం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను బోధించే ఉపాధ్యాయులు ఉంటారని ముందుకు నిదర్శనం మా విద్యార్థులు ఐఐటి మద్రాస్ కోర్సులను చేసి కంప్లీషన్ సర్టిఫికెట్స్ పొందారని, ఇది మా పాఠశాలకు గర్వకారణం అని అన్నారు .మహబూబాబాద్ జిల్లాలో నే మా పాఠశాల ప్రథమ స్థానంలో 16 గురు విద్యార్థులు కోర్సు చేయడం గర్వంగా ఉందని ఎ ఏ పాఠశాలలో ఇంతమంది విద్యార్థులు కోర్సులను చేయలేదని ఒక ప్రకటనలో తెలియజేశారు . దీనికి స్కూల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ (ఎస్ పి ఓ సి) కోఆర్డినేటర్ అనుమాండ్ల జ్యోతి వ్యవహరించారు అని తెలియజేశారు తెలియజేశారు ఫోన్లను ఉపయోగిస్తూ వారి యొక్క భవిష్యత్తును నాశనం చేసుకునేటువంటి ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా మా పాఠశాల విద్యార్థులు ఫోన్లో ఆన్లైన్ పాఠాలను వింటూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే కోర్సులను అందిపుచ్చుకోవడం ఎంతో ఆనందదాయకం. ఈ సందర్భంగా కోర్సులను చేసిన విద్యార్థులు వారి యొక్క భావాలను మా ప్రతినిధితో పంచుకోవడం జరిగింది.
*పుప్పాల హాసిని* ఆర్కిటెక్చర్ మరియు డిజైనింగ్ కోర్స్ చేశానని తెలుపుతూ ఈ కోర్సులో ఇంటీరియర్ డిజైనింగ్ లో భాగంగా నాలుగు సూత్రాలను తెలుసుకున్నాను అవి స్కేలు, ప్రొపోర్షనేట్, కాంట్రాస్ట్, ఎంఫసైజ్ . ఈ కోర్సులో చేరడం వల్ల నేను చాలా విషయాలు తెలుసుకున్నానని, భవిష్యత్తులో నేను ఈ కోర్సులో స్పెషలైజేషన్ చేయడానికి నాకు ఒక అవకాశం లభించిందని తెలిపినది
*అన్విత్*
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మరియు డేటా సైన్స్ లో చేరినట్లు చెబుతూ నేను క్లస్టరింగ్ అల్గారిదంస్ స్ట్రక్చర్ డేటా , నాన్ స్ట్రక్చరల్ డేటా ఏఐ టూల్స్ లో భాగంగా ఆరెంజ్ గురించి నేర్చుకున్నాను తర్వాత లాగేరిథెమ్స్ కూడా నేర్చుకున్నాను అని తెలియజేశారు.
*కల్పగురి వినయ్* మాట్లాడుతూ తాను బయోలాజికల్ ఇంజనీరింగ్ లో చేరానని జైలం, ఫెలోం, ఎంజైమ్, సెల్ గురించి ఎన్నో విషయాలు లోతుగా అధ్యయనం చేసే అవకాశం వచ్చిందని ఐఐటీ ప్రొఫెసర్ తో పాఠాలు నేర్చుకునే అవకాశం కలగడం నా అదృష్టం గా భావిస్తున్నానని తెలియజేశాడు.
*అభినవ్* ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ సిస్టం కోర్స్ చేశానని ఇంటర్మీడియట్ పై స్థాయి విషయాలను తెలుసుకున్నామని, ఫోన్ రిసెంబుల్ బ్యాటరీ బ్యాక్అప్, రోబోట్ కార్ యొక్క మెకానిజం వీల్స్, వోల్టేజ్ యూసేజ్ ఆఫ్ అప్లియెన్సెస్ లాంటి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను అని తెలియజేశాడు.
*దామెర శివ* (ఏరోస్పేస్ కోర్సు చేసిన విద్యార్థి, ) మాట్లాడుతూ ఎర్త్ యొక్క ఎన్ని లేయర్స్ వరకు రాకెట్ వెళ్తుందో, రాకెట్ లో భాగాల గురించి, రాకెట్ను పంపేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి తెలుసుకోవడం నా అదృష్టం అని చెప్పాడు.