logo

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పుస్తకాల వితరణ, సౌండ్ సిస్టం అందజేత .. నేత్రాల సేకరణ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో
పుస్తకాల వితరణ, సౌండ్ సిస్టం అందజేత
.. నేత్రాల సేకరణ

తొర్రూరు నవంబర్ 21(AIMEMEDIA) లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు డాక్టర్ రామ నరసయ్య చిన్న కుమారుడు సూర్నం మోహిత్ పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో శుక్రవారం పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రోటీన్ పౌడర్, అన్నప్రసాద వితరణ, కంటయపాలెం జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో 15 మంది 10వ తరగతి విద్యార్థులకు రూ.6 వేల విలువగల ఆల్ ఇన్ వన్ పుస్తకాలు,రూ.16 వేలతో సౌండ్ సిస్టం, 7వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,6వ తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాలు, అంగన్వాడి పిల్లలకు పలక బలపాలు, పెద్ద నాగారం పాఠశాలలో 20 మందికి రూ.8 వేలతో ఆల్ ఇన్ పుస్తకాలు, 8వ తరగతి విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ పుస్తకాలు, 6,7వ తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాలు పరీక్ష ఫ్యాడ్లు, దంతాలపల్లి గ్రామపంచాయతీ సిబ్బందులకు టవల్స్, అమాలి వర్కర్స్ లకు జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం లావణ్య మెడికల్ నిర్వాహకులు గోపాల్ తండ్రి మృతి చెందడంతో నేత్రాలను సేకరించారు.ఈ కార్యక్రమంలో ఆర్ సి లయన్ దామెర సరేష్, జడ్ సి లు లయన్ చిదిరాల నవీన్ కుమార్, లయన్ డాక్టర్ కిరణ్ కుమార్, క్లబ్ సెక్రటరీ ముడుపు రవీందర్ రెడ్డి, క్లబ్ ట్రెజరర్ వజినపల్లి శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ బోనగిరి శంకర్, పాఠశాల హెచ్ఎం కె.ప్రభాకర్, ఉపాధ్యాయులు అశోక్, జనార్దన్, ఆలీ తదితరులు పాల్గొన్నారు.

0
0 views