logo

రుద్రవరంలోని మండల పరిషత్ కార్యాలయంలో పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు.

నంద్యాల జిల్లా రుద్రవరం మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా మార్కెటింగ్ అధికారి,మండల స్పెషల్ ఆఫీసర్ ఎస్ రహిమాన్, రుద్రవరం తహసిల్దారు ధోని ఆల్ఫ్రెడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పుట్టపర్తి సత్యసాయిబాబా చిత్రపటానికి వారు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పుట్టపర్తి సత్య సాయిబాబా శతజయంతి వేడుకలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి సుబ్రహ్మణ్యం, సీనియర్ అసిస్టెంట్ షడ్రక్ బాబు, వీఆర్వో అంకాలయ్య, వీఆర్ఏలు భాస్కర్, నరసింహ, హుస్సేన్, మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

93
5305 views