logo

ఘనంగా చిత్రాలేఖనం.. పోటీలు...

AIMA MEDIA :NOV 24: MONDAY :విశాఖపట్నం

AIMA న్యూస్ 9:- విశాఖపట్నం జిల్లా :చిన్న గదిలి సమీపంలో శ్రీ కృష్ణరాయపురం గురుకుల పాఠశాలలో లో చిత్ర లేఖన పోటీలు ఘనంగా నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ రత్నం వల్లి మాట్లాడుతూ.. పత్రికా ప్రకటన.

డాక్టర్. బి.ఆర్ .అంబేద్కర్ గురుకులం శ్రీ కృష్ణాపురం విశాఖపట్నం.
సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజుని పురస్కరించుకొని భారత ప్రభుత్వము నవంబర్ 3వ వారాన్ని అవినీతి నిరోధక వారముగా(విజిలెన్స్ వీక్) గా పరిగణించడమైనది.

ఈ సందర్భాన్ని పురస్కరించొని విశాఖపట్నం డ్రిజింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (DCI ) వారు ...
శ్రీ పాము సుధాకర్ డిప్యూటీ మేనేజర్ విజిలెన్స్ డి సి ఐ వారి బృందముతో పాఠశాలకు విచ్చేసి ,
ఆర్ట్ కాంపిటీషన్స్ మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించడమైనది.

ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు వారే స్వయంగా వచ్చి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను బహుకరించిరి.

ఈ కార్యక్రమాల్లో స్థానిక గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి వంకర రత్నవల్లి,
ఆర్ట్ ఉపాధ్యాయుడు పి .సుధాకర్,
వై. సత్యనారాయణ. జూనియర్ లెక్చరర్. బోటనీ మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొనడం జరిగినది.

తమ పాఠశాలకు డ్రిడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ నుండి సిబ్బంది వచ్చి వాలే స్వయంగా పోటీలు నిర్వహించి, బహుమతులు ప్రధానం చేయడము ....
ఎంతో హర్షించదగ్గ విషయమని ప్రిన్సిపాల్ గారి మాట్లాడుతూ కొనియాడిరి.

0
56 views