logo

రోలుగుంట పి.ఎం. శ్రీ పాఠశాలలో స్కౌట్స్ & గైడ్స్ ట్రెక్కింగ్ క్యాంప్

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (పీ.ఎం. శ్రీ పాఠశాల), రోలుగుంటలో స్కౌట్స్ మరియు గైడ్స్ విద్యార్థులకు ట్రెక్కింగ్ క్యాంప్‌ను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.ట్రెక్కింగ్ కార్యక్రమానికి పాఠశాలప్రధానోపాధ్యాయులు టి.వి. శేషగిరిరావు , వ్యాయామ ఉపాధ్యాయులు & స్కౌట్ మాస్టర్ గోవింద్ , ఆంగ్ల ఉపాధ్యాయిని & గైడ్ కెప్టెన్ పి.వి.ఎం. నాగజ్యోతి నాయకత్వం వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహించారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పర్వతారోహణ (రాక్ క్లైంబింగ్) కార్యక్రమం నిర్వహించగా, ధైర్యం, సమన్వయం, శారీరక దృఢత్వం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసేలా ఆ కార్యక్రమం ఉపయుక్తంగా నిలిచింది. అనంతరం ఏర్పాటు చేసిన ట్రెజర్ హంట్ ద్వారా టీమ్ స్పిరిట్, సమస్య పరిష్కార నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు విద్యార్థుల్లో మరింత పెంపొందాయి.
ట్రెక్కింగ్ మార్గమంతా విద్యార్థులు ప్రకృతి ఒడిలో సేదతీరుతూ ఆనందంగా ప్రయాణం కొనసాగించారు. అనంతరం నిర్వహించిన వనభోజనాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉల్లాసంగా పాల్గొని ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.ఈ ట్రెక్కింగ్ క్యాంప్ ద్వారా విద్యార్థుల్లో ధైర్యం, క్రమశిక్షణ, సేవాభావం, సహజీవన లక్షణాలు మరింతగా పెరిగాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

32
1444 views