*💥నేటి నుంచే అమల్లోకి ఎన్నికల కోడ్..*
*తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంతో నేటి(మంగళవారం) నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని SEC వెల్లడించింది. 3 విడతల్లో(డిసెంబర్ 11, 14, 17) ఈ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతకు నవంబర్ 27 నుండి నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. రెండవ విడతకు నవంబర్ 30 నుండి, మూడో విడతకు డిసెంబరు 3 నుండి నామినేషన్లను స్వీకరిస్తారని SEC తెలిపింది.*