logo

మిరియాల వెంకట్రావు 86వ జయంతి వేడుకలు..

విశాఖపట్నం (డాబా గార్డెన్స్)

మహోన్నత వ్యక్తి మిరియాల 86వ జయంతి వేడుకలు...

*14న నుంచి శతజయంతి వరకు ప్రత్యేక కార్యక్రమాలు..

కాపుల ఆత్మగౌరవ ప్రతీక అన్ని సామాజిక వర్గాలను తనవిగా భావించి తెలుగునాట ఎంతో మందికి ఆపన్న హస్తం అందించిన
స్వర్గీయ మిరియాల వెంకటరావు 86వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో విసృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.డాబా గార్డెన్స్ వి జె ఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆహ్వాన కమిటీ తరఫున జనసేన పార్టీ నాయకురాలు పసుపులేటి ఉషా కిరణ్,పసు పులేటి శేఖర్ మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 14న నగరంలోనీ విఎంఆర్డిఏ బాలల ప్రాంగణంలో మిర్యాల వెంకటరావు 86వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.తెలుగు రాష్ట్రాల్లో పలువురు ముఖ్యమంత్రులు,మంత్రులు ఎంతో మంది ప్రముఖులతో సన్నిహితముగా మెలగడంతో పాటు తనదైన శైలిలో సహాయ కార్యక్రమాలు నిర్వహించిన ఘనత మిరియాలకే దక్కుతుందన్నారు.ప్రతి ఏటా మిరియాల జయంతి వేడుకలను ఒక్కొక్క ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది విశాఖలో నిర్వహిస్తున్నామని డిసెంబర్ 14న పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 14 ఉదయం 10 గం||నుంచి మిరియాల వెంకటరావు చిత్రపటం వద్ద ఘనంగా నివాళులర్పించడంతోపాటు ఆయనపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని కూడా ఆయన తనయుడు సీనియర్ ఐఏఎస్ అధికారి మిరియాల శేషగిరి బాబు ఇతర ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుందన్నారు.శత జయంతి ఉత్సవాలు నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.ఆయన జయంతి కార్యక్రమాలను అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తామన్నారు.ఆహ్వాన కమిటీ తరఫున గంట్ల శ్రీనుబాబు,కే వి వి సత్యనారాయణ,జెర్రి పోతుల మోహన్ కుమార్ లు మాట్లాడుతూ మిరియాల ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామన్నారు.ఇప్పటికే మిరియాల పౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచిన మిరియాల భవిష్యత్ తరాలకు బాటలు వేశారన్నారు.ఈ కార్యక్రమంలో కోటపోతుల శ్రీనివాస్,ఆకుల మురళి,సుబ్బు విశ్వనాథ్ తదితరులతో కలిసి ఆహ్వాన కమిటీ ప్రతినిధులు అంతా మిరియాల 86 వ జయంతి వేడుకలకు సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరించారు.

1
174 views