జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఘనంగా జరుపుకున్న 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
మెట్టూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఘనంగా జరుపుకున్న76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
**********************
ఈరోజు అనగా 26 నవంబరు 2025 తేదీన 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మెట్టూరు జడ్పీ హైస్కూల్లో చాలా గొప్పగా నిర్వహించారు 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ కి అప్పజెప్పిన విషయాన్ని ప్రజలు పొందే అధికారాన్ని స్వేచ్ఛ భావాన్ని పిల్లలకి తెలియపరిచారు అలాగే స్కూల్ పిల్లలు తయారు చేసినటువంటి వివిధ సైంటిఫిక్ పరికరాల్ని ఎగ్జిబిషన్ గా ఏర్పాటు చేశారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 11 గంటలకి ప్రతిజ్ఞ నిర్వహించారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా స్కూల్ హెచ్ఎం డిఎల్ మాస్టారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు టిడిపి జిల్లా కార్యదర్శి శ్రీ గెడ్డవలస కమలాకర్ గ్రామ పెద్దలు గేదెల చంద్రమౌళీశ్వర రావు స్థానిక సర్పంచ్ మొజ్ఙాడ రుక్మిణి స్కూల్ చైర్మన్ జామి భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు