logo

టిడిపి యువ నేత మౌర్యసింహా జన్మదిన వేడుకలు నిర్వహించిన పశ్చిమ నియోజకవర్గం....

విశాఖపట్నం(గోపాలపట్నం)

విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం గోపాలపట్నం ఇండోర్ స్టేడియం,ZPH స్కూల్ ,
నందు ప్రభుత్వ విప్ గణబాబు తనయుడు టీడీపీ యువనేత మౌర్యసింహా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మౌర్యసింహా జన్మదినం సందర్భంగా
ఇండోర్ స్టేడియంలో షటిల్ టోర్నమెంట్ నిర్వహించి విజేతలకు మౌర్యసింహా విశాఖ పశ్చిమ నియోజకవర్గం జనసేన నాయకురాలు అంగ దుర్గ ప్రశాంతి చేతుల మీదుగా షీల్డ్ లు, బహుమతులు అందించడం జరిగింది. తదనంతరం మౌర్యసింహా కి కేక్ కట్ చేసి జనసేన,బిజెపి,టిడిపి కార్యకర్తలు కేక్ తినిపించడం.
విశాఖ పశ్చిమ కార్యాలయంలో టీడీపీ కార్యాలయంలో కార్పొరేటర్లు,కూటమి నేతలు, కార్యకర్తలు,మహిళా నాయకురాలు, అభిమానులు సమక్షంలో మౌర్యసింహా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి తినిపించడం జరిగింది.
ఈ జన్మదిన వేడుకలలో మౌర్యసింహా మాట్లాడుతూ నాకు పశ్చిమ నియోజకవర్గ కూటమి నాయకులు,కార్యకర్తలు,అభిమానులు నన్ను ఎంతగానో ఆదరాభిమానాలు పంచినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను
మీ యొక్క అభిమానంతో పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందరికీ ఉంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో ప్రజలందరూ కూడా సుభిష్టంగా ఉంటూ ప్రజా పాలనలో పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో ముందంజున ఉండేవిధంగా మా నాన్న అయినటువంటి ప్రభుత్వ విప్ గణబాబు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు,కూటమి నేతలు,మహిళా నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, క్రీడాకారులు మొదలగున్నవారు పాల్గొన్నారు.

3
135 views