పొలంలో పంట కొయ్యలు కాల్చద్దు:ఏఓ పవన్ కుమార్.
బండి ఆత్మకూరు (AIMA MEDIA): బండి ఆత్మకూరు మండలం బండి ఆత్మకూరు పార్నేపల్లి గ్రామంలో పంట పొలాలు మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ... రైతులు పంటకోత అనంతరం పంట కొయ్యలను, వ్యర్థాలను తగులబెట్టవద్దని భూసారానికి, పర్యావరణానికి హాని తలపెట్టవద్దు అని రైతులను ఏఓ కోరారు.పంట వ్యర్థాలను తగులబెట్టుట వలన పోషకాలు నశిస్తాయి, భూమిలోని సేంద్రియ కర్బనం తగ్గిపోతుంది,నేలలోని సూక్ష్మజీవులు నశిస్తాయి, నేల యొక్క స్వాభావిక లక్షణాలు మారిపోతాయి నేలలో తేమను నిలుపుకునే శక్తి తగ్గి ఆమ్ల గుణం పెరుగుతుంది,పర్యావరణ కాలుష్యం పెరిగి ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది అని ఏఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓతో పాటు వ్యవసాయ విస్తరణ సిబ్బంది లక్ష్మయ్య పాల్గొన్నారు.అక్టోబర్ 30,డిసెంబర్ ఒకటవ తారీఖున తుఫాను ఉన్నదని రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏవో పవన్ కుమార్ తెలిపారు. నెలాఖరు లోపల పంటకోత ముగించుకోవాలని, అనంతరం ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాల్లో నిల్వ ఉంచాలని రైతుల్ని ఏవో కోరారు.