logo

27-11-2025 హిందూపురం పట్టణంలోని 17,18వ వార్డులకు సంబంధించి పలని నగర్ నందు రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం నియోజకవర్గ

27-11-2025 హిందూపురం పట్టణంలోని 17,18వ వార్డులకు సంబంధించి పలని నగర్ నందు రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి "T N దీపిక" గారు...
ఈ సందర్భంగా T N దీపిక గారు మాట్లాడుతూ

హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే బాలకృష్ణ చుట్టపు కింద వచ్చి ప్రజల బాగోగులను గాలికి వదిలేసారు.

అంతేకాకుండా బాలకృష్ణ ఇటీవల పర్యటనలో ఉండంగా మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై టిడిపి గుండాలతో దాడి చేయడం కాకుండా మన నాయకులు కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ మరియు 307 కేసులను నమోదు చేశారు.

ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చి హిందూపురం ప్రజల బాగోగులను చూడాలని తెలిపారు

2029లో వైఎస్సార్సీపీ కార్యకర్తల పాలన ప్రారంభం కాబోతోందని జగన్‌ 2.0 కి రథసారథులు కార్యకర్తలే అన్నారు.

నాడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్‌ కాలేజీలకు పునాది రాళ్లు వేయగా అందులో 5 మెడికల్‌ కాలేజీలు ప్రారంభమయ్యాయన్నారు. పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని అందని ద్రాక్షగా మార్చడమే చంద్రబాబు ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు.

కూటమి ప్రభుత్వ మెడలు వంచేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పీపీపీ విధానం రద్దుకు కోటి సంతకాల సేకరణ కార్యాచరణ చేపట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సంక్షేమ పనులు అంతంత మాత్రమేనని, కూటమిని కూకటి వేళ్లతో పీకేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉందన్నారు.

అనంతరం వార్డులలో కమిటీలను ఏర్పాటు చేసి, రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

రాబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని, హిందూపురం నియోజకవర్గం లో ఎమ్మెల్యేగా T N దీపిక గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రజలు వ్యక్తం చేశారు
ఈ కార్యక్రమంలో టౌన్ కన్వీనర్ మన్సూర్, 18 వ వార్డు ఇన్చార్జ్ మనోజ్ (మింటు) స్థానిక 17వ వార్డు నాయకులు రాష్ట్ర మైనార్టీ సెల్ సహాయ కార్యదర్శి అమానుల్లా, పెరుస్వామి షాజహాన్,18 సత్తి శివ సల్లు సుహేల్ మారుతి ప్రసాద్ అభిషేక్ అమర్, లోకీ తదితర ప్రజా ప్రతినిధులు వైయస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

40
1055 views