logo

రానున్న రోజుల్లో దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది: ఏఐసీసీ అబ్జర్వర్ దేబాషిస్ పట్నాయక్

రానున్న రోజుల్లో రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారమని ఏఐసీసీ అబ్జర్వర్ దేబాషిస్ పట్నాయక్ అన్నారు. గురువారం పార్వతీపురంలో ఏపిసీసీ మెంబెర్ జగత శ్రీనివాస్, డిసిసి బుల్లిబాబు, పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జ్ బత్తిన మోహన్ రావు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు, ఆ పార్టీ నాయకులు తీళ్ళ గౌరీ శంకరరావు, కోలా కిరణ్ కుమార్, సిరిసిపల్లి సాయి శ్రీనివాస్, చొక్కాపు వెంకటరమణ, శాంతి కుమారి తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ప్రజలు ప్రాంతీయ పార్టీ అయినా బి.ఆర్.ఎస్ కు ఓటు వేసి గెలిపించారన్నారు. కొద్ది సంవత్సరాలు తర్వాత బిఆర్ఎస్ పనితనం తెలుసుకున్న ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టారన్నారు. ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి వస్తుందన్నారు. ఆంధ్ర, బీహార్ ఇలా ఎక్కడ చూసినా ఓట్ చోరీ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాలు ప్రకారం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంస్థత నిర్మాణ ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. దానిలో భాగంగా జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో పార్టీ చాలా దృఢ సంకల్పంతో ఉందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జంఝావతీ ప్రాజెక్టు సమస్య వేధిస్తోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆ ప్రాజెక్టుకు మంచి రోజులు వచ్చాయి అన్నారు. తర్వాత ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందన్నారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ వస్తే జంఝావతి ప్రాజెక్టుకు మోక్షం కలుగుతుందన్నారు. జిల్లాను ఏనుగుల సమస్య పీడిస్తోందన్నారు. ఇప్పటివరకు 12 మంది వ్యక్తులు చనిపోగా సుమారు ఆరు కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. సుమారు ఐదేళ్లుగా ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు లేకపోవడం అన్యాయం అన్నారు. పూర్ణపాడు లాబేసు వంతెన పూర్తి కాలేదు అన్నారు. జిల్లాలో 90 శాతం చెరువులు, గెడ్డలు తదితర నీటి వనరులు కబ్జాకు గురయ్యాయి అన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీ తాగునీటి సమస్య వేధిస్తోందన్నారు. డంపింగ్ యార్డ్ సమస్య దశాబ్దాలుగా వేధిస్తోంది అన్నారు. ఆయా సమస్యలన్నీ కాంగ్రెస్ పార్టీతో పరిష్కరింపబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో జాత దిలీప్ కుమార్, గర్భాపు రవికుమార్, రాయల లక్ష్మ, చిట్టయ్య, రాంబాబు, బంకపల్లి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

19
137 views