logo

తెనాలి మధుర స్మృతులు ఎన్నటికీ మరువలేనివి -- భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు



తెనాలి, నవంబర్ 27:
గడచిన ఐదు దశాబ్దాల కాలంలో వేరువేరు సందర్భాల్లో ఆంధ్ర ప్యారిస్ గా కీర్తి పొందిన తెనాలిలో గడిపిన క్షణాలు, ఇక్కడ వ్యక్తులతో పెను వేసుకున్న సాన్నిహిత్యం జీవితంలో ఎన్నటికీ మరువలేనివని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. తెనాలి తో తనకు గల అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నారు. పట్టణంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం ఎక్కడికి వచ్చిన వెంకయ్య నాయుడు ముందుగా మాజీ మంత్రి ఎడ్లపాటి వెంకట్రావు ఇంటికి వచ్చిన సందర్భంగా సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. 1980 నుంచి తెనాలిలో ఆంధ్ర పత్రిక విలేకరిగా, పలు ప్రైవేటు విద్యాసంస్థల్లో తెలుగు పండిట్ గా తాను పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా నిమ్మరాజు గుర్తు చేశారు. ఆ సమయంలో వెంకయ్య నాయుడు బిజెపి ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా అనేకమార్లు తెనాలిలో పర్యటించారని అన్నారు. 1977 పార్లమెంటు ఎన్నికల్లో జనతా పార్టీ ఒంగోలు అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో తొలిసారిగా తన స్వస్థలమైన అమ్మనబ్రోలు వచ్చినప్పుడు వెంకయ్య నాయుడు తొలిసారి తనకు పరిచయమైనారని అప్పటినుంచి నేటి వరకు ఎంతో స్నేహపూర్వకంగా ఆత్మీయంగా తమ పరిచయం కొనసాగుతోందని చలపతిరావు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడుని కలిసిన వారిలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ మంత్రులు నన్నపనేని రాజకుమారి, మండలి బుద్ధ ప్రసాద్, డాక్టర్ కామినేని శ్రీనివాస్, టొబాకో బోర్డు మాజీ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ బాబు దంపతులు, తదితరులున్నారు.

12
398 views