logo

*శ్రీ కొణిదలపవన్ కల్యాణ్ గారు,*

*శ్రీ కొణిదలపవన్ కల్యాణ్ గారు,*
డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - అమరావతి

*విషయం:* చిన్న పత్రికలు – జర్నలిస్టుల అక్రిడిటేషన్ వ్యవస్థలో ఏర్పడిన అన్యాయాలు, కొత్త షరతుల వల్ల ఏర్పడిన తీవ్రమైన సమస్యలు, ఎంపానెల్‌మెంట్‌ను అక్రిడిటేషన్ కు అడ్డంకిగా మార్చిన వాటిపై అత్యవసర పునఃపరిశీలన మరియు సవరించిన మార్గదర్శకాలు జారీ చేయవలసిన అవసరం గురించి – నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) తరపున వినతి.

మాననీయ ఉప ముఖ్యమంత్రి గారికి,

మేము *"నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA)"* తరఫున ఈ వినతిపత్రం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అక్రిడిటేషన్ విధానంలో చోటు చేసుకుంటున్న మార్పులు, ముఖ్యంగా ఎంపానెల్‌మెంట్ లేకపోతే అక్రిడేషన్ ఇవ్వలేమని ఐ&పీఆర్ శాఖ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల చిన్న పత్రికలు మరియు వేలాది జర్నలిస్టులు పడుతున్న తీవ్ర ఇబ్బందులు మీ దృష్టికి తీసుకువస్తున్నాము. ఈ సమస్య కేవలం ఒక వృత్తి సమస్య కాదు. ఇది ప్రజాస్వామ్యానికి శ్వాస లాంటి మీడియా రంగం బలహీనపడే ప్రమాదానికి సంకేతం.

*1. చిన్న పత్రికలపై అఘాతము – 600 పైగా పత్రికలకు అక్రిడేషన్ నిరాకరణ*

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 600 చిన్న పత్రికలకు కేవలం “ఎంపానెల్ లేదు” అనే ఒక్క కారణంతో అక్రిడేషన్ నిరాకరణ జరుగుతోంది. ఈ చిన్న పత్రికలలో పనిచేసే రిపోర్టర్లు—▪️ నెలకు 4,000–8,000 సంపాదన,▪️ బయట అడ్వర్టైజ్ ఆదాయం లేదు,▪️ ప్రింటింగ్ ఖర్చులు తీరని పరిస్థితి,▪️ భద్రత లేకుండా ప్రమాదాల మధ్య పనిచేయడం. అలాంటి పరిస్థితిలో అక్రిడేషన్ అనేది వారి గౌరవం—వారి హక్కు- వారి వృత్తికి గుర్తింపు మాత్రమే. ప్రభుత్వానికి అటువంటి అక్రిడేషన్‌ల వల్ల ఏ ఆర్థిక భారం లేదు, అయినా అక్రిడేషన్‌ను ఆయుధంలా ఉపయోగించడం బాధాకరం.

*2. ఎంపానెల్‌మెంట్‌ను అక్రిడేషన్‌కు అడ్డంకిగా మార్చడం – చట్టపరంగా తప్పు*

ప్రభుత్వ ప్రకటనలకు ఎంపానెల్‌మెంట్ అవసరం నిజమే. కానీ— ఏ జీవోలోనూ, ఏ కేంద్ర మార్గదర్శకాలలోనూ “ఎంపానెల్ లేకుంటే అక్రిడేషన్ ఇవ్వలేదు” అనే నిబంధన లేదు. ఇది పూర్తిగా కొత్తగా అధికారులు సృష్టించిన నియమం గతంలో ఎప్పుడూ లేని, చట్టపరమైన ఆధారం లేని, అమాయక జర్నలిస్టులపై భారంగా మారిన అన్యాయం.

*3. కొత్త వెబ్సైట్ – కొత్త సమస్యలతో గందరగోళం*

ఐ&పీఆర్ శాఖ పోర్టల్‌లో ఉన్న సాంకేతిక సమస్యల వల్ల— స్టేట్ / జిల్లా అప్లికేషన్ క్లారిటీ లేదు, డాక్యుమెంట్ అప్లోడ్ సమస్యలు, వెరిఫికేషన్ టైమ్ ఫ్రేమ్ లేదు, డేటా కనిపించకపోవడం. చిన్న పత్రికలు, మీడియం పత్రికలు ప్రతిరోజూ
జిల్లా సమాచార శాఖ–రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది.

*4. జిల్లా & రాష్ట్ర సమాచార అధికారులకు పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం*

అధికారులకు నియమాలు స్పష్టంగా తెలియకపోవడం వల్ల—ప్రతి కార్యాలయంలో వేర్వేరు సమాధానాలు, వేర్వేరు రూల్స్ అమలు అవుతున్నాయి. ఇది శాఖలోని వాహన అవగాహన సంకేతం.

*5. గత ప్రభుత్వంలో గుర్తించిన అర్హతలు – ఇప్పుడు లెక్కలో లేవు*

గతంలో స్టేట్ హెడ్‌క్వార్టర్స్ అక్రిడేషన్ కోసం రెగ్యులారిటీ, సర్క్యులేషన్, రిజిస్ట్రేషన్, ఈ-ఫైలింగ్ & ఆడిట్ రిపోర్ట్స్ చూసి అక్రిడేషన్లు జారీ చేసేవారు. ఇవేవీ ఇప్పుడు పరిశీలనలో లేవు. ఒక్క మాట – “ఎంపానెల్ లేదు కాబట్టి అక్రిడేషన్ లేదు”.

*6. అసలు ప్రశ్న – అక్రిడేషన్ ఎక్కువ ఇచ్చినా ప్రభుత్వానికి నష్టం ఏమిటి?*

జర్నలిస్టులకు భూములు రావు, సబ్సిడీలు రావు, స్టేట్ లెవెల్ లో బస్సు పాస్ లేదు, రైల్వే పాస్ లేదు, రిస్క్ ఇన్సూరెన్స్ లేదు. అయినా అక్రిడేషన్‌పై ఇంత కఠినత ఎందుకు? ఇది జర్నలిస్టుల వృత్తిపైనే దాడి.

*7. మీడియాను బలహీనపరచే ఈ విధానం రాష్ట్రానికి నష్టం*

చిన్న పత్రికలే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాస్వామ్యానికి నిజమైన స్వరం. వీటిని మూయించినా, అణచినా—ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది, ప్రజల సమస్యలు వెలుగులోకి రావు.

*8. మా డిమాండ్స్ – ప్రభుత్వ ప్రక్షాళనకు NARA వినతి*

మేము వినమ్రంగా కోరుకునేది:

(1) ఎంపానెల్‌మెంట్‌ను అక్రిడేషన్ షరతుగా వెంటనే తొలగించాలి. సెంట్రల్ గైడ్‌లైన్స్, పాత జీవోల ప్రకారం అక్రిడేషన్ ప్రక్రియను అమలు చేయాలి.

(2) అక్రిడేషన్‌కు స్పష్టమైన, పారదర్శకమైన, రాతపూర్వక మార్గదర్శకాలు జారీ చేయాలి.

(3) కొత్త వెబ్సైట్‌లో ఉన్న సాంకేతిక లోపాలను తక్షణమే సరిచేయాలి.

(4) జిల్లా & రాష్ట్ర సమాచార అధికారులకు స్పష్టమైన అవగాహన కల్పించాలి.

(5) చిన్న పత్రికల రక్షణకు ప్రత్యేక పాలసీ రూపొందించాలి. గ్రామీణ మీడియాను బలోపేతం చేయడం ప్రభుత్వ బాధ్యత.

(6) ఇప్పటికే ఉన్న స్టైట్ హెడ్ క్వార్టర్స్ అక్రిడేషన్‌లను తిరస్కరించకుండా కొనసాగించాలి

(7) ఐ&పీఆర్ శాఖలో అధికారులు సృష్టించిన అన్యాయ నియమాలపై విచారణ చేయాలి.

NARA ఇప్పటికే— చిన్న పత్రికల ఆధారాలు, జర్నలిస్టుల జీవన పరిస్థితులు, ఎంపానెల్‌మెంట్ విధాన దుర్వినియోగంపై డాక్యుమెంట్లు, రాష్ట్రవ్యాప్తంగ జర్నలిస్టుల వాంగ్మూలాలు ఇవన్నీ సమగ్ర రీతిలో సిద్ధం చేసి మీకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాము.

ఇది వృత్తి కోసం కాదు, ఇది ప్రజాస్వామ్యం కోసం. మాననీయ ఉప ముఖ్యమంత్రి గారూ, అక్రిడేషన్ అనేది ప్రభుత్వం ఇచ్చే “అనుగ్రహం” కాదు. అది ప్రజాస్వామ్యానికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం. చిన్న పత్రికలు మూగబోతే ప్రజాస్వామ్యం మాట్లాడే గొంతు కోల్పోతుంది.

మీ నాయకత్వంలో— ఈ అన్యాయం సరిదిద్దబడుతుందని, జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని, రాష్ట్ర మీడియా వర్గాలకు నమ్మకం పునరుద్ధరించబడుతుందని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) హృదయపూర్వకంగా ఆశిస్తోంది.

41
674 views