logo

*అక్క చీర..హాట్ టాపిక్..!*


జర్నలిస్ట్ : మాకోటి మహేష్

తెలంగాణ జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత నిన్న శుభకార్యానికి వెళ్లడానికి ధరించిన చీర ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..!

తెలుపు చీర.. ఎరుపు ఆకుపచ్చ రంగు డిజైన్ బోర్డర్ లైన్ తో ఆ చీర ఉండటమే ఇక్కడ ప్రధాన అంశం..!

కవిత క్రమంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారు అని ఈ మధ్య గులాబీ నేతలు సహా రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి..!

పలువురు గులాబీ పార్టీ ప్రముఖ నేతలైతే.. ఆమె ముఖ్యమంత్రి రేవంత్ తో చేతులు కలిపి బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడుతున్నారు..!

ఇలాంటి పరిస్థితుల్లో కవిత ధరించిన చీరపై అందరిలో ఆసక్తి నెలకొంది..

ఆమె కాంగ్రెస్ పార్టీ కండువాలను పోలిన రీతిలో డిజైన్ చేసిన చీరను ధరించారని.. ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని గులాబీ పారీ మద్దతుదారులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు..

ఉప ముఖ్యమంత్రి కుమారుడి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి కూడా ఇదే చీర ధరించి వెళ్లారని.. కావాలనే ఇలా ఆమె చేస్తూ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని కారు పార్టీ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు..!

......

9
367 views