logo

రాజాంలో లివర్–గ్యాస్ట్రో చికిత్సలకు కొత్త దిశ


రాజాం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, బుధవారం:
రాజాం సురేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో అత్యాధునిక గ్యాస్ట్రో ఎంటరాలజీ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన పత్రిక సమావేశంలో గ్యాస్ట్రో ఎంటరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ మంచు చైతన్య మీడియాతో మాట్లాడారు.

డాక్టర్ చైతన్య గత ఆరు సంవత్సరాల పాటు హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్‌లో ప్రఖ్యాత గ్యాస్ట్రో నిపుణుడు డాక్టర్ నాగేశ్వర రెడ్డి వద్ద శిక్షణ పొందినట్లు తెలిపారు. ప్రస్తుతం శ్రీకాకుళం మెడికవర్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్‌గా సేవలందిస్తున్న ఆయన, ప్రతి బుధవారం రాజాం సురేష్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కూడా సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.

ఇప్పటి ఆహారపు అలవాట్ల కారణంగా అన్నవాహిక, జీర్ణ వ్యవస్థ, అరుగుదల సమస్యలు, ఆమ్లత్వం (అసిడిటీ), ప్యాంక్రియాటైటిస్, లివర్ సంబంధిత సమస్యలు అధికం అవుతున్న నేపథ్యంలో, రోగులకు అత్యాధునిక ఎండోస్కోపిక్ విధానాల ద్వారా చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.
అవసరమైతే శస్త్రచికిత్స అవసరం లేకుండా సాధ్యమైనంత వరకు మందుల ద్వారానే చికిత్సను పూర్తి చేస్తున్నట్టు వివరించారు.

అదేవిధంగా ఫైబ్రో స్కాన్ అనే అత్యాధునిక పరికరంతో లివర్‌లో ఏర్పడే అనేక సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, తీవ్రమయ్యే ప్రమాదాన్ని ముందుగానే అరికట్టవచ్చని డాక్టర్ చైతన్య పేర్కొన్నారు.

రాజాం పరిసర ప్రాంత ప్రజలు ఈ సేవల ద్వారా లివర్, జీర్ణాశయం సంబంధిత వ్యాధుల కోసం ఇక దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోతుందని హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి.

13
433 views