logo

నంద్యాల జిల్లా:హత్య కేసులో ముద్దాయిల అరెస్టు ..

హత్య కేసులో ముద్దాయిల అరెస్టు ... వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు.

ఫిర్యాది: చింతల ఆదిత్య ప్రసాద్, 32 సం, తండ్రి: మేదరి పుల్లయ్య, బెంగుళూరు సిటీ, కర్నాటక రాష్ట్రం.

ముద్దాయిలు:

1) భోజనాల ధనుంజయ, 35 సం., తండ్రి: నారాయణ, YSR నగర్, నంద్యాల టౌన్,
2) గంగాధర రాఘవ, 33 సం, తండ్రి : చిన్న వెంకట స్వామి, పెసరవాయి (V), గడివేముల (M).
3) బెస్త శ్రీకాంత్, 22 సం, తండ్రి: వెంకటేశ్వర్లు, బిలకలగుడూరు గ్రామము, గడివేముల మండలము, 4) కాటేపోగు సంతోష్, 20 సం, తండ్రి: సామన్న, పెసరవాయి (V), గడివేముల (M)

స్వాధీనం చేసుకున్నా వొస్తువుల వివరములు:

1) కత్తి, 2) 02 DVR లు, 3) లాప్ టాప్ 4) దస్తావేజులు.

కేసు పూర్వాపరాలు:

19.11.2025 వ తేదీ సాయంత్రము 04 గం లకు ఫిర్యాది నంద్యాల్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు వొచ్చి తన తండ్రి మేదరి పుల్లయ్య, 65 సం నంద్యాల్ టౌన్ లోని VC కాలనీలో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు అని 15.11.2025 వ తేదీనుండి తన తండ్రి కి ఫోన్ చేస్తున్న అయిన ఫోన్ నెంబర్ లు పని చేయడం లేదు అని, అదే దినము తానే స్వయంగా నంద్యాల కు చేరుకొని తండ్రి గురించి విచారించగా తన తండ్రి జాడ తెలియలేదు అని తన తండ్రి ఇంటి లోని మరియు చింతకుంట గ్రామము, గోస్పాడు మండలము లో ఉన్న 02 ఏకరముల పొలంలో పెట్టిన CC కెమెరాలు కు చెందిన DVR లు మరియు తన తండ్రి మోటార్ సైకిల్ కూడా కనపడలేదు అని చేసిన ఫిర్యాదు పైన Cr.No.163/2025 U/sec Man missing కేసును నమోదు చేయడం అయినది.

కేసులో విచారణ లో భాగంగా, 29.11.2025 వ తేదీ ఉదయం కనబడకుండా పోయిన మేదరి పుల్లయ్య యొక్క మృత దేహం తెల్లపురి నుండి బనగానపల్లి కు పోయే రహదారికి ఎడమ పక్కన ప్రవహిస్తున్న కుందూ నది లో తెలి, తలకు బలమైన గాయం కలిగిఉండి పుర్రె పై భాగం లో క్రాక్ ఉన్నది. సదరు శవమును మృతుని కుమారుడు తన తండ్రిగా గుర్తించడం అయినది. ఫిరాది కుమారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా మార్చడం అయినది.

ఇప్పటి వరకు జరిగిన విచారణలో వెల్లడి అయిన విషయములు

మొదటి ముద్దాయి అయిన ధనుంజయ కు సుమారు 1 ½ సం క్రితము, మృతునితో పరిచయం అయి, అతనికి దేవ నగర్ లో ఉన్న ఇల్లును వేరే వారితో అమ్మించినాడు. మృతుడు తన భార్య తో విడాకులు తీసుకొని ఒంటరిగా నంద్యాల్ లో ఉంటున్నాడు. ఆ తర్వాత మృతుని ఆస్తులు గురించి మరియు ఒంటరితనమును ను గమనించిన ధనుంజయ, మృతుడిని చంపుతే అతని ఆస్తులు స్వాధీనం చేసుకోవొచ్చు అని పన్నాగం పన్ని, ఆ విషయంలో ముద్దాయిలు 2 నుండి 4 వారికి డబ్బుల ఆశ చూపి తనతో కలుపుకొని, ఒక బోలెరో వాహనమును 13.11.2025 వ తేదీన అద్దెకు తీసుకొని 14.11.2025 వ తేదీ రాత్రి సుమారు 8 గం ల సమయంలో మృతుడిని ఆటో నగర్ కు పిలుచుకొని గడివేముల మండలము భోగేశ్వరమ్ గుడికు పోవు దారిలో వాహనమును ను ఆపి, మృతుడిని 25 లక్షలు డిమాండ్ చేయగా, మృతుడు లేవు అని చెప్పినందున, ముద్దాయి 1 ధనుంజయ మృతుడి మెడలో తాడు వేసి లాగి పట్టుకొనగా, రెండవ ముద్దాయి మృతుడి ఎడపైన బలంగా గుద్దినాడు, ధనుంజయ తాన చేతిలో కత్తిని పట్టుకొని, దానిని తిప్పి తల పైనా నుదుటి పై భాగములో బలంగా గుద్దగా తలకు బలమైన రక్త గాయము అయి, వారి దెబ్బలకు మృతుడు చనిపోయాడు.

ఆ తర్వాత వారు శవమును మద్దూరు గ్రామము దగ్గరలో ఉన్న కుందూ నది లో వేసి, అతనికి చెందిన, సెల్ ఫోన్, హెల్మెట్, కత్తి, తాడు నీళ్ళలో వేసి, మృతుని ఇంటికి పోయి అక్కడ డబ్బుల కోసం వెతకగా, దొరకనందున DVR బాక్స్, కొన్ని documents, ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళి పోయి, ఆ DVR ను పులిమద్ది వొద్ద ఉన్న కుందూ నదిలో వేసినాడు. 14.11.2025 వ తేదీ ధనుంజయ మరియు రాఘవ లు మృతుని పొలం వొద్దకు పోయి అక్కడ ఉన్న DVR ను తీసుకొని అయ్యలూరి మెట్ట నుండి చాబోలు గ్రామానికి మద్యలో ఉన్న కుంటలో వేసినారు.

ఈ కేసును బట్టి ప్రజలకు తెలియచేయడం ఏమనగా కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా మెలగాలని, వ్యక్తిగత విషయాలు చెప్పవొద్దు అని, ఏదైనా అనుమానం వొస్తే పోలీస్ లకు సంప్రదించమని చెప్పడం అయినది.

#APDeputyCMPawanKalyan #nandyalpolice #AndhraPradeshPolice #APPOLICE100 #ipsofficer #APPolice #awareness #indianpolice #NaraLokesh

16
86 views