నార్నూర్: ప్రణిత బాయ్ అభ్యర్థిత్వంపై గ్రామం మొత్తం దృష్టి – ప్రజల్లో గట్టి నమ్మకం
నార్నూర్ సర్పంచ్ ఎన్నికల్లో ప్రణిత బాయ్ ఎంట్రీతో స్థానిక రాజకీయాల్లో కొత్త ఉద్వేగం కనిపిస్తోంది. స్పష్టమైన అభివృద్ధి లక్ష్యాలు, గ్రామం కోసం పనిచేయాలన్న నిజాయితీ సంకల్పంతో ముందుకు వస్తున్న ఆయనకు యువత, పెద్దలు, వృద్ధులు ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నారు. గ్రామం నలుమూలలు తిరుగుతున్న ప్రణిత బాయ్కు లభిస్తున్న అప్రతిహత స్పందన ఆయన ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
ప్రజల సమస్యలు వినడంలో, వాటికి పరిష్కార మార్గాలు చెప్పడంలో ఆయన చూపుతున్న చొరవ స్థానికంగా మంచి చర్చనీయాంశమైంది. నార్నూర్ అభివృద్ధికి కావాల్సిన నాయకత్వం ప్రణిత బాయ్లే కనిపిస్తోందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పోటీ నార్నూర్ రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా హుషారుగా మార్చింది.