logo

జి ఎం ఆర్ ఐ టి లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సుధా మూర్తి



జి ఎం ఆర్ ఐ టి లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సుధా మూర్తి

పార్లమెంట్ సభ్యులు, రాజ్య సభ (నామినేటెడ్), ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఫౌండర్ ఛైర్పర్సన్, మూర్తి ట్రస్ట్ ఛైర్పర్సన్ శ్రీమతి సుధా మూర్తి గారు ఆదివారం (డిసెంబర్ 14, 2025) స్థానిక జి ఎం ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జి ఎం ఆర్ ఐ టి) లో నిర్వహించిన సభలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీమతి సుధా మూర్తి గారిని ఉద్దేశించి జి ఎం ఆర్ గ్రూప్ చైర్మన్ శ్రీ జి ఎం రావు ప్రారంభోపన్యాసం చేశారు. జి ఎం ఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న వివిధ సామాజిక కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. జి ఎం ఆర్ విద్యాసంస్థల్లో చదువుకున్న అనేక మంది సివిల్ సర్వీసులు, ఉన్నత ఉద్యోగాలు, రాజకీయ రంగం, వ్యాపార మరియు పారిశ్రామిక రంగాలలో విశేషంగా రాణిస్తున్నారని తెలిపారు. సంఘ సంస్కర్తగా, విద్యావేత్తగా, రచయిత్రిగా పేరుగాంచిన శ్రీమతి సుధా మూర్తి గారు రాజాం కు వచ్చి తమ సంస్థ ప్రతినిధులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం ఎంతో ఆనందదాయకమని ఆయన కొనియాడారు.

అనంతరం ప్రసంగించిన శ్రీమతి సుధా మూర్తి గారు విద్య, వైద్య రంగాలు మరియు గ్రామీణ అభివృద్ధి రంగాలలో శ్రీ జి ఎం రావు చేసిన కృషిని హృదయపూర్వకంగా అభినందించారు. విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ఆంగ్ల భాషపై పట్టు అవసరమని, అయితే మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. మాతృభాష మరియు ఆంగ్ల భాషలు శ్రీకృష్ణుడికి ఇద్దరు తల్లులైన దేవకి–యశోదల మాదిరిగా మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని ఆమె వ్యాఖ్యానించారు.

విశేషమైన శ్రమ, నిరంతర సాధన ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ఆ స్థాయికి చేరుకున్న తర్వాత సమాజానికి మనం ఏమి ఇవ్వగలమనే ఆలోచనతో పనిచేయాలని ఆమె విద్యార్థులకు సూచించారు. లక్ష్య సాధనలో మనసును ఇతర ప్రభావాల నుండి దూరంగా ఉంచేందుకు నిరంతర కృషి అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను ఆమె ఉటంకించడం విద్యార్థులను ఆకట్టుకుంది. తదుపరి విద్యార్థుల ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. జె. గిరీష్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీమతి సుధా మూర్తి గారు జి ఎం ఆర్ గ్రూప్ చైర్మన్ శ్రీ జి ఎం రావు గారితో కలిసి జి ఎం ఆర్ వరలక్ష్మీ కేర్ ఆసుపత్రి మరియు నైరేడ్ ఒకేషనల్ సెంటర్ ను సందర్శించారు. నైరేడ్ లో నూతన సాధికారత విభాగాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం జి ఎం ఆర్ ఐ టి విద్యార్థులు రూపొందించిన వినూత్న ప్రాజెక్టులను పరిశీలించి వారిని అభినందించారు.

మహిళా సాధికారతపై రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని శ్రీమతి సుధా మూర్తి గారు ఆవిష్కరించారు. అలాగే 19 మంది గిఫ్టెడ్ చిల్డ్రన్ కు స్కూల్ బ్యాగులను అందజేశారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన 10 మంది విద్యార్థులను ఆమె సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీమతి సుధా మూర్తి గారిని జి ఎం ఆర్ గ్రూప్ చైర్మన్ శ్రీ జి ఎం రావు గారు మరియు ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించారు.

ప్రిన్సిపాల్ డా. సి ఎల్ వి ఆర్ ఎస్ వి ప్రసాద్ వందన సమర్పణ చేశారు.

ఈ కార్యక్రమంలో జి ఎం ఆర్ గ్రూప్ బిజినెస్ చైర్మన్లు శ్రీ బి.వి. నాగేశ్వరరావు, శ్రీ జి.బి.ఎస్. రాజు, శ్రీమతి బొమ్మిడాల రమాదేవి, శ్రీ గ్రంధి పెదబాబు, శ్రీ పిడికె రావు, జి ఎం ఆర్ వి ఎఫ్ ముఖ్య అధికారులు, సిబ్బంది, జి ఎం రావు కుటుంబ సభ్యులు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గ

2
320 views