logo

ఘనంగా నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం.

ఘనంగా నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం.
​చల్మెడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉపసర్పంచ్ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి సమక్షంలో నూతన సర్పంచ్ బొమ్మని మల్లేశం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 12 మంది వార్డు సభ్యులు కూడా తమ బాధ్యతలను స్వీకరించారు.
​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి కుల, మత, రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో ముందుకు వెళ్తానని తెలిపారు. గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా పారిశుధ్యం మరియు తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
​ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, యువకులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు.

68
6232 views