logo

నూతన సంవత్సర వేడుకలకు నిమ్మాడ కార్యాలయం సర్వంసిద్ధం. కేంద్ర, రాష్ట్ర మంత్రులు

శ్రీకాకుళం/నిమ్మాడ, డిసెంబర్ 30:* 2026 కొత్త సంవత్సరం ఆరంభ వేళ టెక్కలి నియోజకవర్గం నిమ్మాడలోని క్యాంప్ కార్యాలయం నూతన సంవత్సర వేడుకలకు సర్వంసిద్ధం అయింది.
వేదిక ప్రాంగణం సందడితో కళకళలాడనుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, క్రమబద్ధమైన ఏర్పాట్లు చేపట్టడంతోపాటు భద్రతాపరంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు తనను కలవడానికి వచ్చే వారు పూల బొకేలు, దండలు, శాలువాలు, కానుకలు తీసుకురావొద్దని ఆయన కోరారు. ఆ ఖర్చుతో పేదలకు సాయం చేయాలని, ముఖ్యంగా పేద విద్యార్థులకు నోటుబుక్స్, చదువు సామగ్రి అందించాలని పిలుపునిచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ, *ప్రజలందరికీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

11
34 views