ఆళ్లగడ్డ జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
AIMA న్యూస్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. తాలూకా జనసేన నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి, సోదరులు ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు పలువురు నాయకులు ఇరిగెల సోదరులకు గజమాలతో సత్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ 2026 నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం ఆనందం అభివృద్ధి కలగాలని కోరారు. కార్యక్రమంలో రాయలసీమ జోన్ కమిటీ సభ్యులు మాబు హుస్సేన్ ఇతర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు