
చలో కదిరి జయప్రదం చేయండి-వసీమ్ బేగ్
*పత్రిక ప్రకటన*
*ముస్లిం లకు రాజకీయ రిజర్వేషన్ డిమాండు తో చేపట్టే పాదయాత్ర ను జయప్రదం చేయండి*
ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో జనవరి 10వ తేదీ (శనివారం) కదిరి పట్టణంలో శాంతియుత పాదయాత్ర నిర్వహించనున్నట్లు ముస్లిం ఐక్యవేదిక కార్మిక సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వసీమ్ బేగ్ తెలిపారు.మడకశిర పట్టణంలో శుక్రవారం ముస్లిం ఐక్యవేదిక కార్మిక సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వసీమ్ బేగ్ పత్రికా విలేఖరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వసీమ్ బేగ్ మాట్లాడుతూ దేశ జనాభాలో గణనీయమైన సంఖ్యలో ఉన్న ముస్లిం సమాజానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల వారి సమస్యలు శాసనసభలు, పార్లమెంటులో ప్రతిఫలించలేకపోతున్నాయని ఆయన అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా సామాజిక న్యాయం, సమానత్వం సాధించాలంటే ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించడం అత్యవసరమని పేర్కొన్నారు.ఈ శాంతియుత పాదయాత్ర నానా దర్గా నుండి ప్రారంభమై జీమాన్ సర్కిల్, ఇక్బాల్ రోడ్, టవర్ క్లాక్, హిందూపురం క్రాస్ మీదుగా కదిరి ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగుతుందని తెలిపారు.ఈ పాదయాత్ర పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా నిర్వహించనున్నందున ముస్లిం సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాసంఘాలు, మేధావులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.