logo

కోడుమూరు మాలవీధిలో సంస్కృతి యజ్ఞం ...విశ్వహిందు పరిషత్ మరియు హైందవశక్తి.

కోడుమూరు::సోమవారం ఉదయం స్థానిక కోడుమూరు పట్టణంలోని శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి దేవాలయంలో విశ్వహిందు పరిషత్ ధర్మ ప్రసార విభాగ్ మరియు హైందవశక్తి ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్దలతో భక్తాదులు స్థానిక ప్రజలు కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో యజ్ఞంలో పాల్గొన్నారు. ఈ యజ్ఞం లోకకళ్యాణం కొరకు మరియు మన సంస్కృతి సంప్రదాయాలను ఇప్పుడు తరాలు మరచిపోకుండా హిందూ సంప్రదాయం గొప్పదనం తెలిసే విధంగా ఈ యజ్ఞం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, దంపతులు పాల్గొన్నారు యజ్ఞం అనంతరం యజ్ఞంలో పాల్గొన్న దంపతులకు కానుకగా శ్రీరాముల వారి చిత్రపటం మరియు చీర సారె మరియు పట్టుపంచే తువాలు కార్యనిర్వాహులు అందించారు కార్యక్రమానికి అల్పాహారం ప్రసాద దాత ఈ మద్దిలేటి శెట్టి గారు నిర్వహించారు కార్యక్రమంలో దంపతులు మోహన్, మౌనిక, లలితా, రాజేశ్వరి, సురేష్, లత, శివ, లచ్చమ్మ ఆచారి,శకుంతల, శ్రీలక్ష్మి, సురేంద్ర, వెంకటేశ్వరమ్మ, చెన్నకేశవులు, ఇమ్మన్యులు, లింగన్న తదితరులు యజ్ఞంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని నిలకంటేశ్వర దేవాలయం అర్చకులు ఈశ్వరయ్య గారి చేతులమీదుగా విహెచ్పి వరప్రసాద్ మరియు హైందవశక్తి సల్వాడి సురేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్ ఖండ కార్యదర్శి నటరాజ్ ఖండ సహా కార్యదర్శి బుగుడే శ్రీనివాసులు విహెచ్పి సత్సంగం ప్రముఖ్ వెంకట్రామయ్య ఆచారి పత్తికొండ ధర్మ ప్రచారకు వై కే రంగన్న కోడుమూరు ధర్మ ప్రచార వరప్రసాద్ మరియు జయప్రకాశ్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

0
667 views