
ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నమెంట్-అభ్యాస్ ఇంటర్నేషనల్ స్కూల్ విజేత
విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని జిఎంఆర్ కేర్ గ్రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల కోసం క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో సుమారు 16 ప్రైవేట్ పాఠశాలల నుంచి ఉపాధ్యాయుల జట్లు పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటాయి.
ఈ పోటీల్లో రాజాం అభ్యాస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉపాధ్యాయుల జట్టు అద్భుత ప్రదర్శనతో మొదటి బహుమతిని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఆ పాఠశాల కరెస్పాండెంట్ రాజేష్ మాట్లాడుతూ విజేతలైన తమ ఉపాధ్యాయ సిబ్బందిపై హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహక కమిటీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని సింహాచలం, విజయనగరం జిల్లా అధ్యక్షులు గట్టి పాపారావు, ప్రభుత్వ హై స్కూల్ రాజాం ప్రధానోపాధ్యాయులు బి.వి.అచ్యుత్ కుమార్ ముఖ్యంగా పాల్గొన్నారు. అలాగే ముఖ్య అతిథులుగా రాజాం నియోజకవర్గ అధ్యక్షులు బి. ఈశ్వరరావు, కార్యదర్శి ఎన్. తారకేశ్వరరావు, కోశాధికారి మరియు క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ ఎం. కిషోర్, మన్మధరావు, కాశీ నాయుడు, రాజాం నియోజకవర్గ కరస్పాండెంట్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.