పింఛన్ డబ్బుల కోసం స్నేహితుడి కిరాతక హత్య,
మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలం లో సంచలనం సృష్టించిన హత్య కేసును డి.ఎస్.పి యు నాగరాజు ఆధ్వర్యంలోని కంభం సీఐ మల్లికార్జున బేస్తవారిపేట సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రారెడ్డి ఎంతో చాకచక్యంతో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది.
డి.ఎస్.పి నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం బెస్తవారిపేట మండలంలోని బీసీ కాలనీ నందు దూదేకుల చెందిన నాగూర్ ఇంటిని అద్దెకు తీసుకొని గత కొంతకాలంగా పొట్టేలు మాంసమును బెస్తవారిపేటలో విక్రయిస్తున్న మోక్షగుండం కొమరోలు చిన రంగయ్య మరియు జయంపు కృష్ణ అను ఇద్దరూ గత కొంతకాలంగా ఒకే చోట ఉంటూ వ్యాపారం సాగిస్తున్నారు గత 31 వ తారీఖున జయంబు కృష్ణయ్యకు పింఛన్ రావడం చేత వచ్చిన 4000 రూపాయలు పింఛన్లు ఇంట్లో సరుకుల కోసం ఇమ్మని అడుగులుగా దాని విషయమై ఇరువురి మధ్య కొంత గొడవ జరిగింది. సదరు రంగయ్య ఆవేశంతో నిద్రిస్తున్న జయంబు కృష్ణయ్యను మాంసం కోసే కత్తితో గొంతు పై మరియు రెండు చేతి మనికట్లను నరకడంతో మృతుడు జయంబు కృష్ణయ్య అక్కడికక్కడే మరణించడం జరిగింది . ఈ విషయమై భయపడిన కొమరోలు రంగయ్య ఇంట్లో నుంచి పారిపోవడం జరిగింది,