logo

మున్సిపాలిటీ ఓటరు జాబితాపై అభ్యంతరాల ఫిర్యాదులను పరిష్కరించాలి: రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని !

మున్సిపాలిటీ ఓటరు జాబితాపై అభ్యంతరాల ఫిర్యాదులను పరిష్కరించాలి:

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని !

మున్సిపాలిటీ ఓటర్ జాబితాల పై వచ్చిన అభ్యంతరాలను ఫిర్యాదులను నిర్ణిత గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు.
బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈనెల 12 వ తేదీ నాడు వార్డుల వారిగా ఫోటో ఎలక్టరోల్స్ జాబితా ప్రచురించడంతోపాటు, 13వ తేదీన డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాలను ప్రచురిస్తామని వివరించారు. 16వ తేదీన తుది పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రచురించి, పోలింగ్ కేంద్రాల వారిగా ఫోటో ఎలక్టరోల్స్ ప్రచురిస్తామని అన్నారు. జిల్లాల వారీగా ఓటరు జాబితాల పై వచ్చిన అభ్యంతరాల వివరాలను సమీక్షించారు. అభ్యంతరాల ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పరిశీలించి, పరిష్కరించాలన్నారు. 2025 సంవత్సరం సంబంధించి 3వ సప్లిమెంటరీ ఓటరు జాబితా నవంబర్ 15 న విడుదలైందని, దాని ప్రకారం పట్టణాలలో వార్డుల వారీగా డ్రాఫ్ట్ ఓటరు జాబితా జనవరి 1న విడుదల చేశామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, ఓటర్ జాబితా పై వచ్చిన అభ్యంతరాల ఫిర్యాదులను చర్చించారు. ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్ గౌడ్, సుందర్ సింగ్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

4
1289 views