సీ సీ డ్రైనేజ్ నిర్మాణ పనులు ప్రారంభించిన సముద్రపు రామారావు
విజయనగరం జిల్లా, నెల్లిమర్ల
నగర పంచాయతీ పరిధిలోని
జరజాపుపేట గ్రామం లో 17 వ, వార్డులో ఉన్న శ్రీ దుర్గమ్మ తల్లి గుడి దగ్గరలో విఎంఆర్డిఏ నిధులు నుండి ఐదు లక్షలు రూపాయలతో సి. సి. రోడ్డు పనులు మరియు 18 వ వార్డు ఎరుబోతు వీధి చివరలో 15వ ఆర్థిక సంఘం నిధులనుండి లక్ష రూపాయలుతో సీసీ డ్రయిన్ నిర్మాణం పనులు ప్రారంభంచిన వైస్ చైర్మన్ సముద్రపు రామారావు
నగర పంచాయతీ జరజాపుపేటను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు వైస్ చైర్మన్ సముద్రపు రామారావు అన్నారు. నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధి జరజాపుపేటలో 17వ వార్డు కౌన్సిలర్ అవనాపు సత్యనారాయణ ఆధర్యంలో మరియు 18వ వార్డు కౌన్సిలర్ నల్లి కృష్ణవేణి, శ్రీను ఆధ్వర్యంలో ఆయా వార్డులలో గల అభివృద్ధి పనులు ప్రారంభించడమైనది. బుధవారం నాడు విఎమ్ఆర్డిఏ నిధులు నుండి 5 లక్షల రూపాయలుతో మరియు 15వ ఆర్థిక సంఘం నిధులు 1 లక్ష రూపాయలుతో, సుమారు 60 మీటర్లు పొడవునా,4 మీటర్లు వెడల్పున, 7ఇంచీల ఎత్తున సిసి రోడ్డును శ్రీ దుర్గమ్మ తల్లి గుడి దగ్గరలో 20 మీటర్ల దూరం నుండి నుండి లే అవుట్ వరకు జరుగుతున్న సీసీ రోడ్డు అభివృద్ధి పనులును మరియు 18వ వార్డులో ఎరుబోతు వీధీలో ముకుంద పైడినాయుడు కల్లం నుండి బోలె కృష్ణ కళ్ళము వరకు సిసి డ్రైన్ ను 15వ ఆర్థిక సంఘం నిధులను నుండి 1 లక్ష రూపాయలుతో, 64 మీటర్లు పొడవున, 1 అడుగు లోతునా,9×6 గల వాల్ సైజ్,1 అడుగు వెడల్పు గల సీసీ డ్రైన్ చేపడుతున్న పనులను సముద్రపు రామారావు పరిశీలించి, తగు సూచనలు చేసి, నాణ్యత ప్రమాణాలను పాటించి, క్వాలిటీగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్స్ ను, కౌన్సిలర్స్ ను, పర్యవేక్షిస్తున్న ఏ.ఈ.లను అభినందించారు. ఈ సందర్భంగా రామా రావు మాట్లాడుతూ.. జరజాపుపేటలో గల 6 వార్డులలో అభివృద్ధి పనులు, ఆయా వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు, త్వరలోనే, మిగతా వార్డులలో, అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రతి వార్డుకు, కౌన్సిలర్ ఆమోదం మేరకు, కౌన్సిల్ తీర్మానం మేరకు, నిధులను కేటాయించడం జరిగిందన్నారు. అలాగే 2023 - 2024 కు మొదటి విడత కు మంజూరైనా 79 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులు నుండి 39 అభివృద్ధి పనులులో ఇప్పటికే చేపట్టడం, వాటిలో 8 పనులు పూర్తి చెయ్యడం జరిగిందని, అప్పటి పనులే, ఆ యొక్క నిధులుతోనే, ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఈ నెల 8వతేదీ నాటికి, 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధుల నుండి,2004 జూన్ లో మంజూరైన vmrda నిధులు నుండి మిగిలిన(టెండర్లు వెయ్యని) వీ.ఎం.ఆర్.డీ.ఏ నుండి చేపట్టే 51 అభివృద్ధి పనులకు టెండర్స్ పిలవడం జరుగుతుందని తెలియజేశారు.ఇవి నగర పంచాయతీ నుండి ప్రతి వార్డుకు కేటాయించబడిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదిక జనాభా ప్రాతిపదిక పై విడుదల చేసిన నిధులని తెలియజేశారు. నిజాలను కప్పిపుచ్చి కొంతమంది దురాలోచనకి గురై ప్రజలను మభ్యపెట్టే ఆలోచనలును ప్రజలు,
ముఖ్యంగా యువత చీత్కరించి, ప్రజల కోసం గ్రామ కోసం శ్రమించే వారిని గౌరవిస్తామన్నారు ప్రజలే స్వయంగా అంటున్నారన్నారు. సిసి రోడ్డు, సిసి డ్రైన్ అభివృద్ధి పనులు కార్యక్రమంలో గ్రామ 17 వ వార్డు కౌన్సిలర్ అవనాపు సత్యనారాయణ, 18,19 వార్డుల కౌన్సిలర్ ప్రతినిధులు నల్లి శ్రీను,తుమ్ము నారాయణమూర్తి, గ్రామ పెద్దలు నల్లి శేఖర్ , తుమ్ము వెంకటరమణ, పోలుబోతూ నారాయణమూర్తి,మద్దిల వాసు, పోలుబోతు సత్యనారాయణ, స్టేట్ నాగవంశం డైరెక్టర్ కాళ్ళ సత్యవతి, ఏఎంసి డైరెక్టర్ మద్దిల ముత్యాలనాయుడు,కనకల హైమావతి, అవనాపు మురళీ కృష్ణ,కాంట్రాక్టర్స్, బుగత శ్రీను,మోయిద చిరంజీవి,నల్లి వెంకటరమణ, మద్దిల పైడిరాజు, కనకల అచ్చెమునాయుడు, అభివృద్ధి కమిటీప్రతినిధులు సముద్రపుసత్తిబాబు, అవనాపూ విజయ్ భాస్కర్,మద్దిల దుర్గారావు, సముద్రపు వెంకటరమణ,నల్లి శివ, నల్లి రాధాకృష్ణ, ఏ.ఈ.లు జగదీష్ పవన్,దినేష్ పాల్గొన్నారు.