logo

లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో అన్న దాన కార్యక్రమం

అన్నదానం మహాదానం - ఎస్సై మాధవరెడ్డి

ఆకలితో ఉన్నవారికి అన్న ప్రసాదం పంపిణీ చేయడం గొప్ప విషయం అని కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి అన్నారు. గురువారం లయన్స్ క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త జూలూరు రమేష్ బాబు కుమారుడు జూలూరు రోహిత్ జన్మదినం సందర్భంగా అన్నప్రసాద పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సామాజిక సేవలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఎల్లప్పుడు అగ్రస్థానంలో ఉంటుందన్నారు. బస్టాండుకు వచ్చి పోయే ప్రయాణికుల ఆకలి తీర్చేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో మేలు చేస్తుందని ఎస్సై మాధవరెడ్డి తెలిపారు. 350 మందికి అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు చిగుల్లపల్లి శ్రీదర్ మాట్లాడుతూ రాబోయే రోజులు మరిన్ని సామాజిక సేవలు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్, కార్యదర్శి కల్మిచర్ల గోపాల్, మెంబర్షిప్ కమిటీ చైర్మన్ గుబ్బ కిషన్, మాజీ కోశాధికారి గోవిందు శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి దారమోని గణేష్, మేకల శ్రీనివాస్, శివ జగదీశ్వర్, మాచిపెద్దిఅశోక్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

45
3290 views