logo

సమాచార కమిషనర్ కు డాక్టర్ కొమ్మోజు రమేష్ వినతి పత్రం: AP లో ఆన్‌లైన్ ఆర్టీఐ కోసం పోరాటం.

ఆంధ్రప్రదేశ్‌లో తక్షణమే ఆన్‌లైన్ RTI సేవలు ప్రారంభించాలి
రాష్ట్ర సమాచార కమిషనర్ రేహానా బేగం గారికి వినతిపత్రం అందజేత
విజయవాడ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ ఆన్‌లైన్ RTI (సమాచార హక్కు) సేవలు లేవు అనే విషయం ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారిందని పేర్కొంటూ,ఫోరం ఫర్ ఆర్టీఐ & హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. కొమ్మోజు రమేష్ మరియు సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీ వేమేశ్వరి పాల్గొన్నారు. ఈరోజు తేది: 08-1-2026 న విజయవాడలోని రాష్ట్ర సమాచార కమిషనర్ డా. రేహానా బేగం గారిని మర్యాదపూర్వకంగా కలిసి
ఆన్‌లైన్ RTI పోర్టల్‌ను వెంటనే అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డా. కొమ్మోజు రమేష్ మాట్లాడుతూ,
భారతదేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే
ఆన్‌లైన్‌లో RTI దరఖాస్తులు, ఫీజుల చెల్లింపు,అప్పీళ్ల దాఖలు, దరఖాస్తుల స్థితి తెలుసుకునే సౌకర్యం
కల్పిస్తున్నాయని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రజలు ఇంకా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రత్యేకంగా
గ్రామీణ ప్రజలు,వృద్ధులు,
మహిళలు,దివ్యాంగులు
పేద ప్రజలు RTI కోసం పోస్టాఫీసులు, కార్యాలయాలకు వెళ్లడం చాలా కష్టంగా మారిందని తెలిపారు.RTI చట్టం 2005 ఉద్దేశం – ప్రజలకు సులభంగా సమాచారం అందించడం అని గుర్తు చేస్తూ,డిజిటల్ యుగంలో కూడా ఆన్‌లైన్ సౌకర్యాలు లేకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.
ఈ వినతిపత్రంలో 1)తక్షణమే పూర్తి స్థాయి ఆన్‌లైన్ RTI పోర్టల్ ప్రారంభించాలి,
2) ఫీజులు ఆన్‌లైన్‌లో చెల్లించే అవకాశం కల్పించాలి,
3) ఫస్ట్ & సెకండ్ అప్పీల్స్ కూడా ఆన్‌లైన్‌లో స్వీకరించాలి,
4)RTI దరఖాస్తులపై పారదర్శకత పెంచాలి
అనే డిమాండ్లు ప్రధానంగా పొందుపరిచినట్లు తెలిపారు.
ప్రజల హక్కుల పరిరక్షణ కోసమే ఈ ఉద్యమం కొనసాగుతుందని,
ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆధునిక ఆన్‌లైన్ RTI సేవలు అందించాలని ఫోరం ఫర్ ఆర్టీఐ & హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. దీనికిగాను కమిషనర్ స్పందిస్తూ, స్వల్ప సాంకేతిక సమస్యలు ఉన్నాయని త్వరలోనే పరిష్కరించి వెంటనే ఆన్‌లైన్ RTI సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు.

0
85 views