
న్యాయవాదులకు రక్షణ చట్టం రావాలి
మన హక్కులు మనం కాపాడుకోకపోతే మనుగడ ప్రశ్నార్థకమే....?
తెలంగాణ బార్ కౌన్సిల్ అభ్యర్థి వి.రఘునాథ్
న్యాయవాదులకు రక్షణ చట్టం రావాలి
మన హక్కులు మనం కాపాడుకోకపోతే మనుగడ ప్రశ్నార్థకమే....?
తెలంగాణ బార్ కౌన్సిల్ అభ్యర్థి వి.రఘునాథ్
జగిత్యాల జిల్లా:
న్యాయం కోసం చట్ట బద్దంగా పోరాటం చేసే న్యాయవాదులకే రక్షణ లేకుండా పోయిందని, న్యాయ వాదుల రక్షణ చట్టం తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని హై కోర్టు సీనియర్ న్యాయవాది, హై కోర్ట్ న్యాయవాదుల అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వి.రఘునాథ్ అన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులుగా పోటీ చేస్తున్న ఆయన గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కోర్టుకు ఎన్నికల ప్రచారం నిమిత్తం విచ్చేశారు. జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాచకొండ శ్రీరాములు అధ్యక్షతన బార్ అసోసియేషన్ హాల్ లో ఆయన న్యాయవాదులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులతో పాటు జర్నలిస్టుల రక్షణ కోసం కూడా ప్రత్యేక చట్టాలు తీసుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం, కోర్టు లలో మౌలిక వసతుల ఏర్పాటు కోసం, న్యాయవాదుల, పౌరుల హక్కుల సాధన కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. న్యాయవాదుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ఆరోగ్య భీమా, కనీస జీవిత బీమా పథకం అమలు అయ్యేలా పోరాటం చేస్తానని తెలిపారు. యువ న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులలో తగు వసతుల ఏర్పాటుతో పాటు లైబ్రరీ లు ఏర్పాటు చేపిస్తామని పేర్కొన్నారు. న్యాయస్థానాలలో న్యాయ మూర్తులకు, న్యాయవాదులకు, కోర్టు లలో పని చేసే అధికారులు, సిబ్బందికి గల సమస్యలు, రాజ్యం పరంగా జరుగుతున్న తీర్పులపై పోరాటం చేద్దామన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులు, న్యాయ పోరాటం, హై కోర్టు తో సహా రాష్ట్రంలోని అన్ని కోర్టులలో గల సమస్యల పరిష్కారం కోసం, న్యాయవాదుల రక్షణ కోసం, న్యాయవాదుల హక్కుల సాధన కోసం, న్యాయ వృత్తికి సమాజంలో మంచి గుర్తింపు కోసం పోరాడుతూ అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ లో కూడా అనేక మార్పులు తీసుకొచ్చి, అందరికీ బార్ కౌన్సిల్ సేవలు అందించాలనే లక్ష్యం తోనే ఈ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్ లో సీనియర్ న్యాయవాదులతో పాటు యువ, మహిళా న్యాయవాదులకు, సరైన గౌరవం దక్కేలా కృషి చేస్తానని అభయమిచ్చారు.
అనంతరం కోరుట్ల, మెట్పల్లి బార్ అసోసియేషన్ లలో కూడా ఆయన బృందంతో స్వయంగా కలిసి తోటి న్యాయవాదుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయా సమావేశాలలో ఆయన మాట్లాడారు.
జగిత్యాల, మెట్ పల్లి బార్ అసోసియేషన్ ల అధ్యక్షులు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, బండ భాస్కర్ రెడ్డి, గోవిందుల రాజన్న,
దామోదర్ రావు, బిరుదుల లక్ష్మణ్, కరవత్తుల భూమయ్య, భూమి రమణ, కందుకూరి కృష్ణా రెడ్డి, పాదం తిరుపతి, పాదం హారిక, పాదం రాజేందర్, క్యాస రఘునాథ్, ఉమా మహేష్, మల్లేష్, బొల్లె రాజన్న, పసునూరి శ్రీనివాస్ తదితరుల తో పాటు అనేక మంది న్యాయవాదులు పాల్గొన్నారు.