logo

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పలువురు నాయకులు, కార్యకర్తలు*

*స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత వైసీపీ ఊసే ఉండదు* *సొంత నాయకులకు కూడా ఆ పార్టీపై విశ్వాసం లేదన్న పరిటాల సునీత*
*వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పలువురు నాయకులు, కార్యకర్తలు*
*సాదరంగా స్వాగతం పలిన ఎమ్మెల్యే సునీత*
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత వైసీపీ ఊసే ఉండదని.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. చెన్నేకొత్తపల్లి మండలం ముష్టికోవెల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు 17కుటుంబాల వారు వెంకటాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ సమక్షంలో టీడీపీలో చేరారు. వారందరికీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ విధానాలు, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తీరు నచ్చక టీడీపీలో చేరామని వారు తెలిపారు. ఎమ్మెల్యే సునీత ఆధ్వర్యంలోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని వారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఓవైపు అభివృద్ధి, ఇంకో వైపు సంక్షేమాన్ని అందిస్తోందన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. వైసీపీ మోసపూరిత విధానాలతో ప్రజలే కాకుండా ఆ పార్టీ నేతలు కూడా విసిగిపోయారన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలిచే పరిస్థితి ఉండదన్నారు. ప్రజలంతా కూటమి పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు....

1
76 views