
ఎమ్మెల్యే దగ్గుపాటి రాకపోయి ఉంటే.
సంక్రాంతి సంబరాల ఫ్లాప్ షో చూడాల్సి వచ్చేది .
ఎమ్మెల్యే దగ్గుపాటి రాకపోయి ఉంటే
---సంక్రాంతి సంబరాల ఫ్లాప్ షో చూడాల్సి వచ్చేది .నిర్వహణలో క్రీడా పాధికార సంస్థ ఘోర వైఫల్యం.అనంతపురం
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి జన సమీకరణలో క్రీడా పాధికార సంస్థ ఘోర వైఫల్యం చెందింది... సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటలతో పాటు ప్రాచీన క్రీడలైన తొక్కుడు బిల్ల, కర్ర సాము, టగ్ ఆఫ్ వార్ ... మొదలైన క్రీడలను నగరంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేశారు.. దీనికి ముఖ్య అతిథులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ విచ్చేశారు... సంక్రాంతి సంబరాలపై ఎటువంటి ప్రచారం లేకపోవడంతో కేవలం పదుల సంఖ్యలో విద్యార్థులు విచ్చేశారు... దీనిపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు... అయితే సాధారణంగా దగ్గుపాటి వెనుక ప్రతి కార్యక్రమానికి దాదాపు 30 మంది వివిధ వాహనాల్లో వస్తుంటారు... వారు కూడా టగ్ ఆఫ్ వార్, కర్ర సాము పోటీలలో పాల్గొనడంతో కార్యక్రమాన్ని మమ అనిపించారు...హాజరైన వారి కన్నా దగ్గుపాటి వెనుక వచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది... .... కనీస ప్రచారం లేకపోవడం వల్లే మహిళలు ఎవరు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు...DSDO గా నియమితులైన మహిళ కనీసం ప్రతిరోజు గ్రౌండ్ కు వచ్చే క్రీడాకారులైన ఆహ్వానించి ఉంటే కార్యక్రమం విజయవంతం అయ్యేదని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలపై సిన్సియర్గా అధికారులు దృష్టి సారిస్తే విజయవంతం అవుతాయి...