రైల్వేస్టేషన్‌లో అద్భుతం
* నిండు ప్రాణాలను కాపాడిన నర్సింగ్ ఆఫీసర్
గోదావరిఖని, జనవరి 13, తెలంగాణ రిపోర్టర్: రైల్లో ప్రయాణిస్తున్న నిండు గర్భిణుడికి ప్రసవం చేసి తల్లి శిశువు ప్రాణాలను కాపాడిన నర్సింగ్ ఆఫీసర్ ను పలువురు అభినందిస్తున్నారు. వివరాల్లోకెళ్తే రామగుండం రైల్వే స్టేషన్‌లో ధనపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న నిండు గర్భిణీ మహిళకు అకస్మాత్తుగా ప్రసవవేదనలు రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న గోదావరిఖని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ ఆఫీసర్ నిండు గర్భిణి పరిస్థితిని గుర్తించి వెంటనే స్పందించారు. ఆమె ధైర్యసాహసాలతో రామగుండం రైల్వే స్టేషన్‌లోనే అత్యవసర చికిత్స అందించారు. అక్కడికక్కడే ప్రసవం నిర్వహించి తల్లి, శిశువు ఇద్దరి ప్రాణాలను కాపాడారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి రెండు నిండు ప్రాణాలను రక్షించిన నర్సింగ్ ఆఫీసర్ ను ప్రయాణికులు, స్థానికులు అభినందించారు. మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ ఘటన ప్రజల హృదయాలను హత్తుకుంది.