logo

దివ్యాంగులకు సంక్రాంతి సరుకుల పంపిణీ.

నంద్యాల (AIMA MEDIA ): నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ లయన్స్ క్లబ్ సేవా సంస్థ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జన్మదినోత్సవం సందర్భంగా, లయన్స్ క్లబ్ యువజన విభాగం ఉపాధ్యక్షుడు భవనాశి నాగ హితేష్ పుట్టినరోజు పురస్కరించుకుని, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు, భవనాశి నాగ మహేష్ సౌజన్యంతో, స్థానిక నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన సేవా కార్యక్రమంలో 16 మంది దివ్యాంగ కుటుంబాలకు సంక్రాంతి పండుగ కోసం ఆహార సరకుల కిట్లు అందజేశారు.ముందుగా మెల్విన్ జోన్స్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు, రాష్ట్ర ఐ.ఎమ్.ఎ. మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ స్ఫూర్తి తో నంద్యాల లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామన్నారు. భవనాసి నాగ మహేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా లయన్స్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జన్మదినోత్సవం రోజు దివ్యాంగులకు సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ల ప్రాంతీయ చైర్మన్ సుధాకర్ రెడ్డి, జోన్ చైర్మన్ నిజాముద్దీన్,జిల్లా చైర్మన్ కసెట్టి చంద్రశేఖర్, కోశాధికారి అమిదేల జనార్ధన్, సభ్యులు భవనాసి సాయి శ్రీ హిత్, రామయ్య లబ్ధిదారులు పాల్గొన్నారు.

4
130 views