logo

స్వామి వివేకానంద జయంతి: రాజుపేటలో మేలుకొలుపు

కోటవురట్ల మండలం, రాజుపేట: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ హిందూ సేన కోటవురట్ల ఆధ్వర్యంలో పంచమ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. మేలుకొలుపు సమ్మేళనంలో సుమారు 25 గ్రామాల నుంచి బృందాలు పాల్గొని, హైందవ ధర్మానికి మేలుకొలుపు చేశాయి.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూజ్య శ్రీ శ్రవణ చైతన్యానంద స్వామీజీ వారు హాజరై, అందరికీ అర్థమయ్యే సరళంగా ఉపన్యాసం ఇచ్చారు. హైందవ సంస్కృతి గొప్పతనం, ధర్మప్రయోగాలు, ఐక్యత గురించి చెప్పి అందరికీ ఆశీర్వాదం చేశారు. ఈ సమ్మేళనం గ్రామీణ యువతలో జాగృతి తీసుకొచ్చి, ధర్మరక్షణకు ప్రేరేపించింది.గ్రామ ప్రెసిడెంట్ శ్రీ బొడ్డేటి వెంకటరమణ , ఎంపీటీసీ శ్రీ యల్లపు కుమార్ రాజా , మాజీ ప్రెసిడెంట్ మరియు మాజీ మండల వైస్ ఎంపీపీ శ్రీ వేగి ఈశ్వర రామచంద్ర మూర్తి , మాజీ ప్రెసిడెంట్ శ్రీ సూరిశెట్టి గంగాధర శ్రీనివాస్ పాల్గొన్నారు. హిందూ సేన అధ్యక్షుడు శ్రీ నక్కా సత్యనారాయణ తోటి సభ్యులతో కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ ఉత్సవం గ్రామాల్లో హైందవ ఐక్యతను మరింత బలపరిచి, స్వామి వివేకానంద ఆదర్శాలను అమలు చేయాలనే సంకల్పాన్ని నింపింది.

0
7 views