logo

సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో సంతోషాలను నింపాలి:జిల్లా ఎస్పీ.

నంద్యాల (AIMA MEDIA): నంద్యాల జిల్లా పోలీస్ సిబ్బందికి మరియు ప్రజలకు జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసినారు. ఈ సంక్రాంతి జిల్లా ప్రజలందరికీ భోగభాగ్యాలను,సుఖసంతోషాలను, అందించాలని, సంక్రాంతి పండుగను తెలుగు సంస్కృతి సాంప్రదాయాలతో ఆనందోత్సవాలతో జరుపుకోవాలని, మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ పండుగ సందర్భంగా రోడ్లపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మోటార్ సైకిల్ పై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మరియు శాంతిభద్రతల విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

3
3 views